Share News

Power Commission: మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు

ABN , Publish Date - Jun 25 , 2024 | 07:32 PM

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పవర్ కమిషన్ మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్‌‌కు అందిన సమాచారంపై తమ అభిప్రాయం చెప్పాలని పవర్ కమిషన్‌ తన నోటీసుల్లో కేసీఆర్‌కు స్పష్టం చేసింది.

Power Commission: మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు
Ex CM KCR

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పవర్ కమిషన్ మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్‌‌కు అందిన సమాచారంపై తమ అభిప్రాయం చెప్పాలని పవర్ కమిషన్‌ తన నోటీసుల్లో కేసీఆర్‌కు స్పష్టం చేసింది. జూన్ 27వ తేదీ లోపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని సదరు నోటీసుల్లో మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించింది. అలాగే ఇదే అంశంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డితోపాటు మరికొంత మందికి సైతం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

Also Read: రాహుల్ చెబుతున్న ‘సంప్రదాయం’.. ‘ఇండియా’లో కనరావడం లేదు


మరోవైపు ఇంతకు ముందు అంటే జూన్ రెండోవారంలో కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో మీ ‘పాత్ర’ గురించి తెలియజేయాలని ఆ నోటీసుల్లో కేసీఆర్‌కు పవర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ నోటీసుల ప్రకారం జూన్ 15వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని పేర్కొంది. కానీ ఈ విషయంలో తనకు జులై 30వ తేదీ వరకు సమయం ఇవ్వాలని పవర్ కమిషన్‌ను మాజీ సీఎం కేసీఆర్ కోరినట్లు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేయడం బీఆర్ఎస్‌లో విస్మయం వ్యక్తమవుతుంది.

Also Read: Loksabha Speaker Election: ఇండియాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అందులోభాగంగా కమిషన్ విచారణ చేపట్టింది. దీంతో విద్యుత్ శాఖలోకి కీలకంగా వ్యవహరించిన అధికారులను వరుసగా పిలిచి విచారిస్తోంది. ఆ క్రమంలో వారికి కీలక ప్రశ్నలను సైతం కమిషన్ సంధించినట్లు తెలుస్తుంది. అందులోభాగంగా కేసీఆర్‌కు పవర్ కమిషన్ గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా ఇచ్చిన నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనే విషయంపై ఆ పార్టీలో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Also Read: Telangana: లోక్‌సభలో ప్రమాణం చేసిన తెలంగాణ ఎంపీలు

Also Read: అమరణ నిరాహార దీక్ష విరమించిన మంత్రి అతిషి

Also Read: కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

Also Read: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

Also Read: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 08:15 PM