Share News

PM Modi: కుటుంబ పార్టీల పాలనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - Mar 05 , 2024 | 10:09 AM

PM Modi Telangana vist Live: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) మంగళవారం సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పటాన్‌చెరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. అంతకుముందు ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

PM Modi: కుటుంబ పార్టీల పాలనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Live News & Update

  • 2024-03-05T13:00:42+05:30

    కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై మోదీ విమర్శలు

    పటాన్‌చెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. రెండు పార్టీల మధ్య బలమైన అవినీతి బందం ఉంది. దీని గురించి ప్రపంచం అంతా తెలుసు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ వేల కోట్లు దోచుకుంది. కానీ బీఆర్‌ఎస్ అవినీతిని కాంగ్రెస్ దాచిపెడుతోంది. కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగింది తెలిసినప్పటికీ కాంగ్రెస్ మౌనం ఉంది.’’ అని మోదీ అన్నారు.

  • 2024-03-05T13:00:39+05:30

    తమ హయాంలో సర్టికల్స్ స్ట్రైక్స్ జరిగాయని, ఎయిర్‌స్ట్రైక్స్ కూడా జరుగుతాయని ప్రధాని మోదీ చెప్పారు. దీనికి మీ సహకారం కావాలని కోరారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మోదీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు.

  • 2024-03-05T12:30:38+05:30

    కుటుంబ పాలనపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు

    పటాన్ చెరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కుటుంబ పార్టీల పాలనపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ మాట్లాడుతూ.. ‘‘వారసత్వ రాజకీయాలను నేను వ్యతిరేకిస్తున్నాను. కుటుంబపార్టీల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ నాపై విమర్శలు చేస్తోంది. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రత భావం పెరిగిపోయింది. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖాజానాను నింపుకుంటున్నారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నాం. ప్రజల నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము కానివ్వను. ఇక్కడ దోచుకున్న నల్లధనం దాచుకోవడానికి విదేశాల్లో ఖాతాలు తెరిచారు. ’’ అని వ్యాఖ్యానించారు.

  • 2024-03-05T12:15:21+05:30

    కుటుంబ పార్టీలపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

    పటాన్ చెరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘‘అయోధలో రామమందిరం నిర్మిస్తామని చెప్పాం. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరిగింది. దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీల పాలన కొనసాగుతోంది. కుటుంబ పార్టీల పాలనలో ఉన్న చోట వారి కుటుంబాలే బాగుపడ్డాయి. కుటుంబపార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా?’’ అని ప్రశ్నించారు.

  • 2024-03-05T12:00:53+05:30

    పటాన్ చెరు సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

    తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది.

    తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది.

    బీజేపీని బాగా ఆదిరిస్తున్నారు.

    ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను మార్చుతాం.

    భారత్ ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలి.

    ప్రపంచదేశాల్లో తెలుగు ప్రజలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

  • 2024-03-05T12:00:34+05:30

    పటాన్ చెరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ప్రేమను తెలంగాణ అభివృద్ధి రూపంలో చూపిస్తా. విదేశాల్లో చాలామంది తెలుగువారు ఉన్నారు. విదేశాల్లో మనవాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశాం. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.’’ అని అన్నారు.

  • 2024-03-05T11:30:22+05:30

    పటాన్‌చెరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన అభివృద్ధి పనులు

    NH-161 లోని కంది - రామసానిపల్లె సెక్షన్‌లో 4 వరుసల జాతీయ రహదారికి సంబంధించిన రూ.1,409 కోట్ల పనులకు శంకుస్థాపన

    NH-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన రూ.323 కోట్ల పనులకు శంకుస్థాపన

    హైదరాబాద్, సికింద్రాబాద్‌లో రూ.1,165 కోట్లతో చేపట్టిన 103 కి.మీ.ల MMTS ఫేజ్ - II ప్రాజెక్ట్‌కు పనులు ప్రారంభం

    ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం

  • 2024-03-05T11:30:14+05:30

    సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించామని, ఈ సంస్థ వల్ల తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  • 2024-03-05T11:30:09+05:30

    పటాన్‌చెరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన అభివృద్ధి పనులు

    NH-65 లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణకు 1,298 కోట్లతో శంకుస్థాపన

    399 కోట్లతో NH-765Dలో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులకు ప్రారంభోత్సవం

    500 కోట్లతో NH-765Dలో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన

    రూ.3,338 కోట్లు ప్రారంభించిన పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.

  • 2024-03-05T11:15:34+05:30

    సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడుతూ ‘‘నిన్న ఆదిలాబాద్ నుంచి రూ56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించాం. ఇవాళ రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర కట్టుబడి ఉంది. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం’’ అని తెలిపారు.

  • 2024-03-05T11:15:26+05:30

    సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

  • 2024-03-05T11:15:11+05:30

    సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

  • 2024-03-05T11:15:03+05:30

    సంగారెడ్డిలో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ది సాధ్యమవుతందని ప్రధాని అన్నారు.

  • 2024-03-05T11:00:50+05:30

    తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

  • 2024-03-05T10:45:57+05:30

    అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం పటేల్‌గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీలో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఉదయం 11:20 గంటలకు ఈ సభ ప్రారంభంకానుంది.

  • 2024-03-05T10:45:49+05:30

    తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లాలోని పటేల్ గూడకు చేరుకున్నారు. జిల్లాలో పలు అభివృద్ది పనులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

  • 2024-03-05T10:45:26+05:30

    ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సంగారెడ్డిలో మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. 2 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యటన ముగిసిన పర్యటన ముగిసిన తర్వాత మోదీ ఒరిస్సాకు వెళ్లనున్నారు.

  • 2024-03-05T10:45:21+05:30

    సంగారెడ్డి జిల్లాలో రూ.1409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్లతో ఎన్‌హెచ్-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.399 కోట్లతో చేపడుతున్న ఎన్‌హెచ్ 765డి మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, రూ. 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

  • 2024-03-05T10:30:25+05:30

    సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి ఆలయంలో పూజలు ముగించుకున్న ప్రధాని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. అక్కడి నుంచి ప్రధాని సంగారెడ్డికి చేరుకోనున్నారు. సంగారెడ్డిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

  • 2024-03-05T10:15:10+05:30

    తన పర్యటనలో భాగంగా రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానితో పాటు గవర్నర్‌ తమిళి సై (Gover Samil sai), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Central Minister Kishan Reddy) కూడా

  • 2024-03-05T10:00:11+05:30

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని అమ్మవారికి ప్రధాని పూజలు చేశారు. ప్రధానితోపాటు ప్రముఖులను మాత్రమే ఆలయంలోకి అనుమతి ఇచ్చారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ లో భారీ భద్రతను ఏర్పాటుచేశారు.