Share News

Pushpak Buses: లింగంపల్లి- ఎయిర్‌పోర్టుకు పుష్పక్‌ బస్సులు..

ABN , Publish Date - Dec 14 , 2024 | 06:35 AM

లింగంపల్లి నుంచి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టు(Lingampalli to Rajiv Gandhi Airport)కు ఆదివారం నుంచి పుష్పక్‌ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ సి.వినోద్‌కుమార్‌ తెలిపారు.

Pushpak Buses: లింగంపల్లి- ఎయిర్‌పోర్టుకు పుష్పక్‌ బస్సులు..

- ఉదయం 5.45 నుంచి సర్వీసులు ప్రారంభం

- గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌ సిటీ: లింగంపల్లి నుంచి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టు(Lingampalli to Rajiv Gandhi Airport)కు ఆదివారం నుంచి పుష్పక్‌ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ సి.వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లింగంపల్లి నుంచి అల్విన్‌ ఎక్స్‌రోడ్‌, హఫీజ్‌పేట, కొండాపూర్‌, కొత్తగూడ, గచ్చిబౌలి(Alvin X Road, Hafizpet, Kondapur, Kothaguda, Gachibowli) మీదుగా ఎయిర్‌పోర్టుకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా


లింగంపల్లి(Lingampalli) నుంచి మొదటి బస్సు ఉదయం 5గంటల 45 నిమిషాలకు, చివరి బస్సు రాత్రి 8 గంటల 45 నిమిషాలకు, రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టు నుంచి మొదటి బస్సు ఉదయం 7.30 గంటలకు, చివరి బస్సు రాత్రి 10.30 గంటలకు ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

city1.2.jpg


బస్సుల సమయపాలన...

లింగంపల్లి-రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు..

- 5:45, 6:35, 7:25, 8:15, 9:05, 9:55, 10:45, 11:35, 14:55, 15:45, 16:35, 17:25, 18:15, 19:05, 19:55, 20:45

ఎయిర్‌పోర్టు-లింగంపల్లికి..

- 7:30, 8:20, 9:10, 10:00, 10:50, 11:40, 12:30, 13:20, 16:40, 17:30, 18:20, 19:10, 20:00, 20:50, 21:40, 22:30


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 06:35 AM