Share News

TS News: మరోసారి వీధి రౌడీలా ప్రవర్తించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:17 AM

కుత్బుల్లాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మరోసారి వీధి రౌడీలాగా ప్రవర్తించారు. అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌ను యూజ్‌లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు.

TS News: మరోసారి వీధి రౌడీలా ప్రవర్తించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మరోసారి వీధి రౌడీలాగా ప్రవర్తించారు. అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌ను యూజ్‌లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. ఆటోవాలాలకు న్యాయం చేయాలని కోరుతూ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆటోల్లో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన వారిలో వివేకానందతోపాటు ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద ధర్మా చేశారు. ఈ ధర్నా కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులకు, ఎమ్మెల్యే వివేకానందకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులతో వివేకానంద వీధి రౌడీలాగా ప్రవర్తించారు.


కాగా వివేకానంద ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి ఏంకాదు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది. రామ్‌లీలా మైదానం వేదికగా జరిగిన బహిరంగ చర్చలో భూకజ్జాల విషయంలో బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన వివేకానంద.. శ్రీశైలం గౌడ్‌పై దాడి చేసి గొంతు పట్టుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కాగా ఈ చర్చా వేదికలో కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డి కూడా పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2024 | 12:20 PM