R. Krishnaiah: అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధం..
ABN , Publish Date - Nov 26 , 2024 | 08:04 AM
పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్ చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.
- రాజ్యాధికారం కోసం ఏర్పాటు
- బీసీ సమరభేరిలో ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్ చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. సోమవారం రవీంద్రభారతిలో బీసీల సమరభేరి మహాసభ జరిగింది. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో బీసీలందరికీ సమాన వాటా లభించాలని, బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఖాకీల ‘స్పా’ కహానీ.. అడ్డదారిలో డబ్బు సంపాదనకు దందా
ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల లెక్క తేల్చేందుకు కులగణన ఉపయోగపడుతుందని, బీసీలంతా ఐక్యంగా తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ సూచన మేరకే రాష్ట్రంలో కులగణన చేపట్టామని, తమ పార్టీ బీసీల పక్షపాతి అని చెప్పారు.
బీసీల హక్కుల డిమాండ్ కోసం సమరభేరి నిర్వహించడం అభినందనీయమని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నందగోపాల్, నీల వెంకటేష్ అధ్యక్షత వహించిన ఈ సభలో ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గుజ్జ కృష్ణ, బాలమల్లేశ్, బీసీ సంఘాల నేతలు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో పాములు
ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్ స్టేడియం
ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..
Read Latest Telangana News and National News