Vivekanand: రాజగోపాల్‌రెడ్డి... కాబోయే సీఎం!
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:02 AM
కాబోయే సీఎం... అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ ఆటపట్టించారు.
ఎమ్మెల్యే వివేకానంద్ సరదా వ్యాఖ్య
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాబోయే సీఎం... అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ ఆటపట్టించారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. తాను సీఎం కంటే ముందు మంత్రి కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ వద్ద తాను ప్రస్తావిస్తానని వివేకానంద్ పేర్కొనగా.. తనకు మంత్రి పదవి ఎప్పుడు ఇవ్వాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తుందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ‘‘అన్నా నువ్వు మంత్రి అయ్యే దాకా నీతో మాట్లాడను..ఇదే నా శపథం’’అని వివేక్ నవ్వుతూ అన్నారు.