Share News

Harish Rao: ఆడపిల్లలు దు:ఖాన్ని ఆపులేకపోతున్నారు... మొద్దు నిద్ర వీడండి

ABN , Publish Date - Aug 31 , 2024 | 03:42 PM

Telangana: జిల్లాలోని పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ‘‘ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు.

Harish Rao: ఆడపిల్లలు దు:ఖాన్ని ఆపులేకపోతున్నారు... మొద్దు నిద్ర వీడండి
Former Minister Harish Rao

రంగారెడ్డి, ఆగస్టు 31: జిల్లాలోని పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు (Former Minister Harish Rao), సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ‘‘ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు. ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదు. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి. మీకు చీమ కుట్టినట్లు అయినా లేదు. సిగ్గుచేటు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. నువ్వు పూర్తిగా విఫలం అయ్యావు’’ అంటూ విరుచుకుపడ్డారు.

Red Alert: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ..


పిల్లలు రోడ్డు మీదకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ తెల్సుకోవాలని వచ్చానని.. దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నారని అన్నారు. భయంతో వణికిపోతున్నారన్నారు. కర్రలు విరిగేలా కొడుతున్నారని ఏడుస్తున్నారని తెలిపారు. ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని.. రెండో జత ఇవ్వలేదు అంటున్నారన్నారు. పుస్తకాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని మండిపడ్డారు. కేసీఆర్ సన్నబియ్యంతో అన్నం పెడితే మీరు గొడ్డు కారంతో పెడుతున్నరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.


500 మంది ఆసుపత్రుల పాలయ్యారన్నారు. 38 మంది చనిపోయారన్నారు. పాములు కరిచి చనిపోతున్నారని.. ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. ఒకప్పుడుగురుకులాల్లో చదవటం కల అని.. ఇప్పుడు ఆవేదన చెందుతున్నారన్నారు. కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ‘‘ఇక్కడ ఉన్న టీచర్లను మార్చండి. మంచి భోజనం పెట్టండి’’ అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విద్యా శాఖా మంత్రిగా ఉన్నారని... మైనార్టీ గురుకులాలు జనవరి నుంచి మెస్ బిల్లులు ఇవ్వలేదన్నారు. అన్ని గురుకులాల్లో కాస్మొటిక్ చార్జెస్, కరెంటు బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదని.. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తక్షణం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు హితవుపలికారు.

YSRCP: విదేశాలకు జగన్.. వైసీపీలో సంక్షోభం తప్పదా



గురుకులాలను గాలికి వదిలేశారు: సబిత

గురుకులాలను గాలికి వదిలేశారని మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖను పట్టించుకోవడం లేదన్నారు. ఎవరు ఏం అడిగిన పట్టించుకునే వారు లేరన్నారు. సీఎం ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదని అడిగారు. అసెంబ్లీలో అడిగినా సమాధానం లేదని... ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

TPCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్ ఫిక్స్.. నేడే ప్రకటన!

HYDRA: హైడ్రా యాక్షన్ షురూ.. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 31 , 2024 | 04:04 PM