Ganesh Laddu: రికార్డు ధర పలికిన బండ్లగూడ గణేశ్ లడ్డు.. ఆ నగదు ఏం చేస్తారంటే?
ABN , Publish Date - Sep 17 , 2024 | 11:43 AM
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో లడ్డూ రూ.1.87కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది.
రంగారెడ్డి: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వినాయకుడి లడ్డూ వేలంపాటలో స్వామివారి ప్రసాదం రికార్డు ధర పలికింది. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో లడ్డూ రూ.1.87కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. దీంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ వేలంపాట రికార్డు నెలకొల్పింది. గతేడాదీ కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణపతి లడ్డూ ప్రసాదం రూ.1.26కోట్లు పలికింది. ఈసారి దాని కంటే అధనంగా రూ.61లక్షల ధర ఎక్కువ పలికింది. అయితే ప్రస్తుతం రూ.1.87కోట్లు పలకడంతో గత రికార్డును బద్దలు కొట్టినట్లు అయ్యింది.
దాదాపు వంద మంది సభ్యులు వేలంపాటలో పాల్గొన్నారు. 25మంది చొప్పున నాలుగు గ్రూపులుగా ఏర్పడి వేలంపాట పాడారు. ఒక గ్రూపునకు చెందిన 25మంది స్వామివారి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేషుడి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేశారు. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును గతేడాది లాగే వివిధ సేవా కార్యక్రమాల కింద ఖర్చు చేయనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పేదలు, హాస్టల్‌లో చదువుతున్న పేద విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఆర్థికసాయం చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. అయితే రికార్డు స్థాయిలో ధర పలకడంతో రెండు రాష్ర్టాల ప్రజలు ఆశ్చర్యానికి గరవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Special Buses: వినాయక నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలకు టీజీఎస్ఆర్టీసీ చెక్..
Balapur Laddu: బాలాపూర్ గణేశా మజాకా.. భారీ ధర పలికిన లడ్డూ
Khairatabad Ganesh: మెుదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర..
For more Telangana news and Telugu news click here..