Engineering Colleges: ఈసారి 98,296 ఇంజనీరింగ్ సీట్లు..
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:12 AM
ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తంగా 173 ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ కాలేజీల్లో 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
173 కాలేజీలకు గుర్తింపు
కన్వీనర్ కోటాలో 70,307 సీట్లు,
మిగతావి మేనే జ్‌మెంట్‌లో భర్తీ
కంప్యూటర్ కోర్సుల సీట్లే అధికం
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తంగా 173 ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ కాలేజీల్లో 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 70,307 సీట్లను కన్వీనర్ కోటా కింద, మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేయనున్నారు. జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లోనే 56,564 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా మొత్తం సీట్లలో ఎక్కువ కంప్యూటర్ కోర్సులకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇంజనీరింగ్ (ఎప్‌సెట్) సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది గుర్తింపు పొందిన కాలేజీలు, వాటిలోని సీట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను ఆదివారం అధికారులు ప్రకటించారు. కాగా, సీఎ్‌సఈ కోర్సులో 21,599; సీఎ్‌సఈ (ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్) లో 11,196; ఈసీఈలో 10,398; సీఎ్‌సఈ (డేటా సైన్స్)లో 6,516, ఈఈఈలో 4,202; ఐటీలో 3,705; సివిల్ ఇంజనీరింగ్‌లో 3,231; మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2,979; సీఎ్‌సఈ (సైబర్ సెక్యూరిటీ)