CM Revanth: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా కేశవరావుకు క్యాబినెట్ ర్యాంక్..!
ABN , Publish Date - Jul 04 , 2024 | 08:49 PM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావు(Keshava Rao)కి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్(Cabinet rank) ఇవ్వాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. కేశవరావు రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావు(Keshava Rao)కి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్(Cabinet rank) ఇవ్వాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. కేశవరావు రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ఢిల్లీ పర్యటలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీలోని కేకే నివాసానికి ఆయన చేరుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేశవరావు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో కేకే నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్లు పక్కా ఉంటుందని, రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని సీఎం చెప్పారు. మూసీ అభివృద్ధి, రీజనల్ రింగు రోడ్డుపై దృష్టి పెట్టామని, ఎటువంటి గందరగోళం లేకుండా 11వేలకు పైగా టీచర్ల బదిలీలు చేశామని అన్నారు. అనంతరం కేకే నివాసం నుంచి తెలంగాణకు వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు.
ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.." కాంగ్రెస్ నా సొంత ఇల్లు, నేను ఆ పార్టీ మనిషిని. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చింది. పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. రాష్ట్రంలో పాలన ఇప్పుడు ప్రజస్వామ్యబద్దంగా ఉంది. ఆరు నెలల్లో ఎవరినీ అంచనా వేయలేం. ఆరు నెలల్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చూశా. ఫ్యామిలీ పబ్లిసిటీ అనేది గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారు. నైతిక విలువలతో రాజీనామా చేశాను. ఇదే విషయాన్ని రాజీనామా సమయంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కి కూడా చెప్పాను" అని అన్నారు.