Share News

Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

ABN , Publish Date - Oct 03 , 2024 | 04:14 AM

ఫార్మా కంపెనీలకు వ్యాపార సహకారం అందించే ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.

Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

  • వచ్చే రెండేళ్లలో 300 నిపుణులకు ఉద్యోగాలు: మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఫార్మా కంపెనీలకు వ్యాపార సహకారం అందించే ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. అమెరికా కేంద్రంగా ఉన్న ఆ సంస్థ సీఈవో వెండీ బార్నెస్‌.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. కంపెనీ పెట్టుబడులను శ్రీధర్‌ బాబు స్వాగతించారు. ఇక్కడ కేంద్రం ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో 300 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.


ఈ సంస్థ తనకు క్లయింట్లుగా ఉన్న ఫార్మసీలకు లాభాలు పెంచుకోవడంలో తోడ్పడుతుందని, హైదరాబాద్‌ నైపుణ్య కేంద్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తుందని శ్రీధర్‌ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత అపారంగా ఉన్నందున బహుళ జాతి సంస్థలకు తెలంగాణ చుక్కానిగా మారిందని తెలిపారు. వ్యాపార విస్తరణకు అనుకూల వాతావరణం ఉండటం, మౌలిక సదుపాయాల పరంగా ఎటువంటి సమస్యలు లేనందున ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుందని వివరించారు. ఆధునిక సాంకేతిక, జెనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో డిజిటల్‌ పరివర్తన అనివార్యంగా మారిందని చెప్పారు.

Updated Date - Oct 03 , 2024 | 04:14 AM