Share News

Kamareddy: నార్సింగ్‌ మునిసిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం..

ABN , Publish Date - May 19 , 2024 | 03:45 AM

గండిపేట మండలం నార్సింగ్‌ మునిసిపాలిటీని అధికార కాంగ్రెస్‌ దక్కించుకోగా.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో మాత్రం ఆ పార్టీకి షాక్‌ తగిలింది. అక్కడ ఇటీవలే కాంగ్రె్‌సలో చేరిన మునిసిపాలిటీచైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టగా బీఆర్‌ఎస్‌ సభ్యులతో పాటు కాంగ్రెస్‌ సభ్యులు కూడా అనుకూలంగా ఓటేశారు. శనివారం నార్సింగ్‌ మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌గా ఉన్న రేఖ, వైస్‌చైర్మన్‌గా ఉన్న వెంకటేశ్‌ యాదవ్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది.

Kamareddy: నార్సింగ్‌ మునిసిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం..

  • ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో సీన్‌ రివర్స్‌

  • కాంగ్రె్‌సలో చేరిన చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

నార్సింగ్‌/ఎల్లారెడ్డి, మే 18 (ఆంధ్రజ్యోతి): గండిపేట మండలం నార్సింగ్‌ మునిసిపాలిటీని అధికార కాంగ్రెస్‌ దక్కించుకోగా.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో మాత్రం ఆ పార్టీకి షాక్‌ తగిలింది. అక్కడ ఇటీవలే కాంగ్రె్‌సలో చేరిన మునిసిపాలిటీచైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టగా బీఆర్‌ఎస్‌ సభ్యులతో పాటు కాంగ్రెస్‌ సభ్యులు కూడా అనుకూలంగా ఓటేశారు. శనివారం నార్సింగ్‌ మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌గా ఉన్న రేఖ, వైస్‌చైర్మన్‌గా ఉన్న వెంకటేశ్‌ యాదవ్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. దీంతో వారు తమ పదవులను కోల్పోయారు. మొత్తం 18 మంది కౌన్సిల్‌ సభ్యులుండగా.. 14 మంది అనుకూలంగా ఓటేశారు.


ఇటు లోక్‌సభ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎల్లారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణకు వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో బీఆర్‌ఎ్‌సకు చెందిన తొమ్మిది మందితో పాటు కాంగ్రె్‌సకు చెందిన ఇద్దరు సైతం తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. రాష్ట్రంలో అవిశ్వాసం పెట్టిన మునిసిపాలిటీల్లో అధికార కాంగ్రెస్సే చైర్మన్‌ పదవులను నెగ్గుతూ వచ్చింది. కానీ ఎల్లారెడ్డిలో మాత్రం ఆ పార్టీకి షాక్‌ తగిలింది.

Updated Date - May 19 , 2024 | 03:45 AM