Telangana Floods: నేడు రాష్ట్రంలో కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:43 AM
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ, హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం బండి సంజయ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేంద్ర మంత్రులు ఖమ్మంలో పర్యటిస్తారు.
తొలుత ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కోదాడకు బండి సంజయ్ వెళ్లి అక్కడి వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు సంజయ్‌తో పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో, పార్టీ నాయకులు ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారు.