Share News

Madnoor Incident: బైక్‌ కొనివ్వలేదని తండ్రిని కర్రతో కొట్టి చంపాడు

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:57 AM

వృద్ధాప్యంలోనూ కూలీ పనులకు వెళుతూ కష్టపడుతున్న కన్నతండ్రికి ఆసరాగా ఉండకపోగా ఊర్లో జులాయిగా తిరుగుతున్న యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.

Madnoor Incident: బైక్‌ కొనివ్వలేదని తండ్రిని కర్రతో కొట్టి చంపాడు

  • ఓ జులాయి నిర్వాకం.. కామారెడ్డి జిల్లాలో ఘటన

మద్నూర్‌, ఆగస్టు 8: వృద్ధాప్యంలోనూ కూలీ పనులకు వెళుతూ కష్టపడుతున్న కన్నతండ్రికి ఆసరాగా ఉండకపోగా ఊర్లో జులాయిగా తిరుగుతున్న యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ద్విచక్రవాహనం కొనివ్వాలంటూ కొన్నాళ్లుగా తండ్రిని వేధిస్తున్న యువకుడు, తనకు అంత స్థోమత లేదని తండ్రి చెప్పడంతో కర్రతో తలమీద కొట్టి తండ్రిని చంపాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో ఈ ఘటన జరిగింది.


మృతుడు అదే గ్రామానికి చెందిన నార్లవార్‌ అర్జున్‌ (64). ఆయనకు భార్య ఎల్లవ్వ, కుమారుడు వెంకట్‌ ఉన్నారు. వెంకట్‌ చదువును మధ్యలోనే ఆపేసి, ఊర్లో ఆవారాగా తిరుగుతున్నాడు. కుటుంబ పోషణ కోసం అర్జున్‌ రోజూ కూలీ పనులకు వెళుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి.. తనకు బైక్‌ కొనివ్వాలని తండ్రితో వెంకట్‌ ఘర్షణకు దిగాడు. తాను కొనివ్వలేనంటూ అర్జున్‌ అశక్తత వ్యక్తం చేయడంతో వెంకట్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో అర్జున్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

Updated Date - Aug 09 , 2024 | 03:57 AM