Special train: కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక రైలు
ABN , Publish Date - Oct 16 , 2024 | 01:31 PM
కర్ణాటక(Karnataka)లోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు డిసెంబర్ 5న భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్(Bharat Gaurav South Star Rail)ను ఏర్పాటు చేసినట్లు టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగార్, సౌత్‌స్టార్ రైల్ ప్రొటెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు.
హైదరాబాద్: కర్ణాటక(Karnataka)లోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు డిసెంబర్ 5న భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్(Bharat Gaurav South Star Rail)ను ఏర్పాటు చేసినట్లు టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగార్, సౌత్‌స్టార్ రైల్ ప్రొటెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే టూర్ పోస్టర్‌ను ఆవిష్కరించి వారు మాట్లాడారు. మార్గశిర మాసం సందర్భంగా నవ బృందావనం, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, శృంగేరి, హోంనాడు, ధర్మస్థల, కుకి సుబ్రహ్మణ్య, మైసూర్, శ్రీరంగపట్నం, మేల్‌కోటేలను సందర్శించడానికి 9 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం నేడు..
ఈ టూర్‌కు 33 శాతం రాయితీ పొందవచ్చని, సీనియర్ సిటిజన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 5న చెన్నై(Chennai)లో బయల్దేరనున్న ఈ ట్రైన్ ఏపీలోని గూడూరు, నెల్లూరు, ఓంగోలు, చీరాల.. తెలంగాణలోని మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌లలో ఆగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9355021516 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
.......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
......................................................................
Hyderabad: నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఉక్కుపాదం మోపాలి..
- ఎక్సైజ్ అధికారులకు డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు
హైదరాబాద్ సిటీ: డ్రగ్స్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(Drugs, non-duty paid liquor)పై ఉక్కుపాదం మోపాలని డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ టాస్క్ ఫోర్స్ అధికారులను అదేశించారు. మంగళవారం అబ్కారీ భవన్‌లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎక్సైజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలలో ఎక్సైజ్ అధికారులు, స్టేషన్ల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి 56 కేసులు నమోదు చేశారని.. 53 మందిని అరెస్టు చేసి 111 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దూల్‌పేట్(Dhulpet)లో గట్టి చర్యలు చేపట్టడంతో గంజాయి వ్యాపారాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి అమ్మకాలు సాగిస్తున్నారనే సమాచారం ఉందని, మరింత నిఘా పెంచి గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల్లో చార్జ్జిషీట్స్ వేయాలని, లిక్కర్ అమ్మకాల్లో ధరల వ్యత్యాసాలు లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, శంషాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సరూర్‌నగర్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, ఎస్‌కే పయాజోద్దీన్, కె.నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్!
ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్
ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు
ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి
Read Latest Telangana News and National News