Share News

GDP Growth: జీఎస్‌డీపీ రూ.14.63 లక్షల కోట్లు 2023-24లో 11.9% వృద్ధి

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:18 AM

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) 2023-24 సంవత్సరంలో (ప్రస్తుత ధరల వద్ద) రూ.14,63,963 కోట్లుగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన జీఎ్‌సడీపీ రూ.13,08,034 కోట్లతో పోల్చితే 11.9 శాతం వృద్ధి రేటు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.

GDP Growth: జీఎస్‌డీపీ రూ.14.63 లక్షల కోట్లు 2023-24లో 11.9% వృద్ధి

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) 2023-24 సంవత్సరంలో (ప్రస్తుత ధరల వద్ద) రూ.14,63,963 కోట్లుగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన జీఎ్‌సడీపీ రూ.13,08,034 కోట్లతో పోల్చితే 11.9 శాతం వృద్ధి రేటు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగం ఊతమివ్వడంతో జీఎ్‌సడీపీ పెరిగింది. దీనికి సేవల రంగం 65.7ు, పారిశ్రామిక రంగం 18.5ు, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు 15.8శాతం మేర స్థూల విలువను జోడించాయి. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23తో పోలిస్తే 2023-24లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల స్థూల జోడింపు విలువ (జీవీఏ) 4 శాతం పెరిగింది. వ్యవసాయ రంగంపైనే రాష్ట్రంలోని 47.3 శాతం జనాభా ఆధారపడగా.. సర్వీసు రంగంపై 33ు, పారిశ్రామిక రంగంపై 19.7 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 03:18 AM