Share News

Loan Waiver: 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి!

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:18 AM

రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది. తొలి విడతలో లక్ష వరకు, రెండో విడతలో లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకున్న బకాయిలను మాఫీచేసింది.

Loan Waiver: 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి!

  • ఆపై రుణాలున్న రైతులకు 4వ విడతలో

  • తర్వాతే ఈ 3 స్లాబుల్లో మిగిలినవారికి

  • ఇప్పటివరకు మాఫీ చేసిన సొమ్ము రూ. 17,870 కోట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది. తొలి విడతలో లక్ష వరకు, రెండో విడతలో లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకున్న బకాయిలను మాఫీచేసింది. అయితే ఈ కేటగిరీల్లో ఇంకా కొందరు రైతులు మిగిలిపోయారు. రేషన్‌ కార్డులులేని, సాంకేతిక సమస్యలతో అనర్హుల జాబితాలో చేరిన రైతులకు ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది.


ఈ మూడు కేటగిరీల్లో కలిపి ఇప్పటివరకు 22,22,067 మంది రైతులకు రూ. 17,869.26 కోట్లు మాఫీచేశారు. రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులతోపాటు, మొదటి మూడు స్లాబుల్లో మిగిలిపోయిన రైతులకు నాలుగో విడతలో రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. నెల రోజుల క్రితం ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. జూలై 15న మార్గదర్శకాలతో కూడిన జీవోను విడుదల చేసింది. జూలై 18న మొదటి విడత, 30న రెండో విడత, గురువారం మూడో విడత రుణమాఫీ చేసింది.


  • రూ.5,644 కోట్లు విడుదల

మూడో విడత రుణమాఫీలో భాగంగా పంద్రాగస్టు రోజున రూ. 5,644.24 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రెండు లక్షల కేటగిరీలో ఉన్న 4,46,832 మంది రైతులకు గురువారం రుణమాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీచేసి మూడో విడత రుణమాఫీరి ప్రారంభించారు. గురువారం బ్యాంకులకు సెలవు కావటంతో.. శుక్ర, శనివారాల్లో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.


  • జిల్లాల వారిగా మూడు విడతల్లో చేసిన రుణమాఫీ

    8.jpg

Updated Date - Aug 16 , 2024 | 03:18 AM