Agriculture: ఉపాధిహామీపైౖ రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది: దుద్దిళ్ల
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:12 AM
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి వ్యవసాయానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ అనుసంధానం చేయిస్తే మంచిదని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మతాలు, కులాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తోందని శ్రీధర్‌బాబు అన్నారు.