Share News

Karimnagar: పెండింగ్‌ బిల్లుల కోసం కలెక్టర్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:45 AM

‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.11 లక్షల బిల్లులు ఇప్పించాలని కోరుతూ కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి ఎదుట ఓ మాజీ సర్పంచ్‌ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

Karimnagar: పెండింగ్‌ బిల్లుల కోసం కలెక్టర్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

  • అడ్డుకున్న పోలీసులు

సుభా్‌షనగర్‌(కరీంనగర్‌), జూలై 8 : ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.11 లక్షల బిల్లులు ఇప్పించాలని కోరుతూ కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి ఎదుట ఓ మాజీ సర్పంచ్‌ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన రామడుగుకు చెందిన మాజీ సర్పంచ్‌ భర్త జగన్మోహన్‌గౌడ్‌ కలెక్టర్‌ ముందే మెడకు చేతిరుమాలు చుట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అడ్డుకొని బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ వారం క్రితం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి తన గోడు వెళ్లబోసుకున్నానని అయినా డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


పురుగుల మందు డబ్బాతో వచ్చిన బాధితుడు

అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఓ బాధితుడు పురుగు మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చాడు. పోలీసులు దాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాధితుడు ఒగ్గు రాజమల్లు మాట్లాడుతూ తాను గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి చెందిన వాడినని, తన భూమి ఇతరుల పేరున ధరణి పోర్టల్‌లో నమో దైందన్నాడు. సరిచేయాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు. సీఐ సరిలాల్‌ రాజమల్లు దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చా రు. అనంతరం రాజమల్లు కలెక్టర్‌కు దరఖాస్తు అందజేసి వెళ్లిపోయారు.

Updated Date - Jul 09 , 2024 | 02:45 AM