TS Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ..
ABN , First Publish Date - Jul 24 , 2024 | 11:06 AM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య రెండో రోజు సభ మొదలైంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు, కరెంటు లేకుండా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని బీఆర్ఎస్‌ను విమర్శించారు.
Live News & Update
-
2024-07-24T17:52:50+05:30
తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా..
తెలంగాణ శాసనసభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. బుధవారం సభలో కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు చేయకపోవడంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరితమైన వైఖరిని సభా వేదికగా ఎండగట్టారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది.
-
2024-07-24T17:51:14+05:30
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరణ: సీఎం రేవంత్
ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారు.
వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు.
ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు.
తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.
విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.
రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చాము.
ఎవరి దయా దాక్షిన్యాలతో నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు.
ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిసాను.
18సార్లు కేంద్ర మంత్రులను కలిసాం.
తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసాం.
ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిసాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు.
తెలంగాణపై కేంద్రానిది వివిక్ష మాత్రమే కాదు.. కక్ష పూరిత వైఖరి.
కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు.
ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని వాళ్లు గుర్తుంచుకోవాలి.
తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్‌కు రూ.7.26 పైసలు.
తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1లక్షా 68వేల కోట్లు మాత్రమే.
మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి.
ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత?
దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22.26 లక్షల కోట్లు.
కేంద్రం ఐదు రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6.42 లక్షల కోట్లు మాత్రమే.
యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ.3.41 లక్షల కోట్లు మాత్రమే.
కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6.91 లక్షల కోట్లు.
ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష.
దేశం 5ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం.
మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాం.
ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు.
సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది మాట్లాడటం శోచనీయం.
అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు.
రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశాం.
తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.
-
2024-07-24T17:01:46+05:30
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మాస్ కౌంటర్
డిల్లీలో ధర్నాకు మేము రెడీ.
రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.
అన్నింటికి మమ్మల్ని దీక్ష చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు.
అన్ని మేము చేస్తే ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు.
దీక్షకు కేసీఆర్ ఎందుకు.. ముఖ్యమంత్రి నువ్వు చెయ్.
నీకు రక్షణ కవచంగా మేము వెయ్యి మంది ఉంటాం.
అగ్గి పెట్టె దొరకలేదని నన్ను పదే పదే కామెంట్స్ చేస్తున్నావు.
పదవులను గడ్డి పోచలా వదిలిపెట్టిన చరిత్ర నాది.
టీడీపీలో ఉండి రాజీనామా చేయమంటే పారిపోయిన చరిత్ర నీది.
ఉద్యమ కారులపై తుపాకీ ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది నీవు.
-
2024-07-24T16:58:58+05:30
గురువారం అసెంబ్లీకి కేసీఆర్..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అసెంబ్లీకి హాజరవుతారు.
బడ్జెట్ ప్రసంగంలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీకి హాజరు కానున్న గులాబీ బాస్.
-
2024-07-24T16:18:14+05:30
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం అసంతృప్తి..
కేంద్ర బడ్జెట్ తెలంగాణను తీవ్రంగా నిరాశపరిచింది
ప్రధానిని ఎన్నో అడిగాం..ఒక్కటీ ఇవ్వలేదు
సభను ప్రతిపక్షం తప్పుదారి పట్టిస్తోంది
ప్రశ్నోత్తరాల తర్వాత తీర్మానం ఉంటుందని చెప్పాం
మేం అంశాన్ని ముందే చెప్పి చర్చకుపెట్టాం
మీరు అప్పటికప్పుడు ఎన్నో అంశాలు ప్రస్తావించారు
ప్రతిపక్షానికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం
-
2024-07-24T16:12:22+05:30
సచ్చేదాకా కూర్చోండి: కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మంత్రివర్గం మొత్తం జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయండి.
సచ్చేదాక కూర్చోండి.
మేము కూడా వస్తాం.
వెయ్యి మంది వచ్చి మద్దతు ఇస్తాం.
సీఎం ఇటీవల లేవనెత్తిన మాటలను నేను ఉటంకిస్తున్నా అని అన్నారు.
కాగా, నిరుద్యోగుల సమస్యపై, పరీక్షలు వాయిదా వేయడంపై కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలని, సచ్చేదాకా కూర్చోవాలని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుస్తుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలను అసెంబ్లీలో ఉటంకిస్తూ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
-
2024-07-24T15:51:25+05:30
హరీష్ రావు, మంత్రి పొన్నం మధ్య వాగ్వాదం..
తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోవడంపై అసెంబ్లీ వాడీ వేడి చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్‌కు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మంత్రి పొన్నం మాట్లాడుతుండగా.. హరీష్ రావు ఏయ్ అని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు జాగ్రత్త.. ఏయ్ అంటే ఊరుకోను..
ఏయ్ అనే పదం మంచిది కాదు.
తాను బలహీన వర్గాల బిడ్డననే ఉద్దేశంతో ఆ దొర అహంకారంతో మాట్లాడుతున్నాడు.
ఏయ్ అంటే ఊరుకోను.. జాగ్రత్త.
ఎక్కడి నుంచో గాలికొచ్చానని.. ఏం అన్నా పడుతానని హరీష్ అనుకుంటే బాగోదు. జాగ్రత్త. అని మంత్రి పొన్నం వార్నింగ్ ఇచ్చారు.
సభా సంప్రదాయాన్ని, తన గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.
ఏయ్ అనడం ఏంది? అని ప్రశ్నించారు మంత్రి పొన్నం.
అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు హరీష్ రావు రాగా.. డిప్యూటీ స్పీకర్ వారించారు.
-
2024-07-24T15:15:25+05:30
గుండుసున్నా వచ్చినా బుద్ధి మారకపోతే ఎలా?: సీఎం రేవంత్
2018లో పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెడితే మోదీకి మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
2019లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి మద్దతుగా బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నది నిజం కాదా?
అసెంబ్లీ సాక్షిగా నోట్ల రద్దును కేసీఆర్ స్వాగతించారు.
గొప్ప నిర్ణయమని పొగడ్తలతో ముంచెత్తింది మీరు కాదా?
రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి అండగా నిలబడింది బీఆర్ఎస్ కాదా?
అన్నింట్లో మద్దతు పలికి పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
ట్రిపుల్ తలాక్ విషయంలోనూ బీజేపీకి అనుకూలంగా ఉండేలా బీఆర్ఎస్ వ్యవహరించింది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికింది.
సాగు చట్టాల విషయంలోనూ బీఆర్ఎస్ బీజేపీకి అండగా నిలిచింది.
కేంద్రం నుంచి నిధులు కాదు.. మోదీ ప్రేమ ఉంటే చాలు అని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారు.
ఆదానీ, అంబానీలతో చీకట్లో కుమ్మక్కు అయ్యే అవసరం మాకు లేదు.
సభ నిర్వహించేది గాలి మాటలు మాట్లడటానికి కాదు.
రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన.
ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండిగ్ వాళ్లు పెట్టారు.
మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు..
ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు.
గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా?
ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరుతున్నా.
-
2024-07-24T14:11:13+05:30
కేటీఆర్: మీకు కూడా ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చారు. ఐటీఐఆర్ తెస్తారా చస్తారా?. మీకు కూడా బాధ్యత ఉంది. మేము ఎక్కడికీ వెళ్లము. ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు నిలదీస్తాం. యూనియన్ బడ్జెట్‌లో తెలంగాణ అన్యాయంపై చర్చ ఎక్కడ జరగాలి?. పంజాబ్ ఎంపీలు రోడ్డు ఎక్కితే మన ఎంపీలు ఎక్కడ పోయారు. నిలదీయాల్సింది పార్లమెంట్‌లో. అక్కడ మొహం చెల్లక ఇక్కడ చర్చ పెట్టారు. బడే భాయ్, చోటే భాయ్ కలిస్తే ఏం జరిగింది?.
-
2024-07-24T13:54:31+05:30
కేటీఆర్ వర్సెస్ డిప్యూటీ సీఎం భట్టి
కేటీఆర్: పార్లమెంట్ లో తెలంగాణ పదం రాకపోవడానికి అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం. 8 ప్లస్ 8 అంటే గుండు సున్నా అని తేలింది. అక్కడ ఏం జరగదని మీకు ఇప్పుడు అర్థమైంది. బడ్జెట్‌లో పక్క రాష్ట్రానికి ఇవ్వడం సంతోషమే. కానీ మనకు ఇవ్వకపోవడం బాధాకరం.
భట్టి విక్రమార్క: మనకు జరిగిన నష్టంపైన ప్రజలు ఆవేదనతో ఉన్నారు. దానిపైన చర్చ పెడితే వారేం చేశారో చెబుతున్నారు. దాని కోసం కాదు మేము చర్చ పెట్టింది.
కేటీఆర్: బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీకు ఎందుకు ఇబ్బంది?. సభలో ఏం మాట్లాడాలో మాకు తెలుసు. మేం ఏం మాట్లాడాలో కూడా మీరే చెబుతారా?. రేవంత్ రెడ్డి చిన్న వయసులో సీఎం అయ్యారు. కష్టపడి సీఎం అయిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. తెలంగాణ యాచించే స్థితిలో ఉండొద్దు. శాసించే స్థితిలో ఉండాలి. సభలో అసలు తీర్మానమే ప్రవేశపెట్టలేదు. ఇది చర్చ మాత్రమే. కేంద్ర నీతిమాలిన రాజకీయాల్ని ఆనాడు, ఈనాడు మేము వ్యతిరేకించాం. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. అయినా కేంద్రం కోసం మేము ఎదురు చూడలేదు. కేంద్రం నయా పైసా ఇవ్వకపోయినా పని చేశాం. కోచ్ ఫ్యాక్టరీ కోసం కలిసి కొట్లాడదాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వస్తాం. కేంద్రం ఇవ్వకపోయినా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. సింగరేణి గనులు వేలం వేస్తుంటే చిరునవ్వులు నవ్వుతూ భట్టి పాల్గొన్నారు. డిస్కంలను ప్రైవేటు పరం చేయకండి
భట్టి విక్రమార్క: కేటీఆర్ సభను, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తామని ఎవరు అన్నారు. ఏదో పేపర్‌లో వచ్చిందని ఏది పడితే అది మాట్లాడితే ఎలా?. కేంద్రం చేసిన నష్టంపై ఏం చేద్దామో చెప్పండి.
కేటీఆర్: ఓల్డ్ సిటీలో బిల్లుల కోసం వెళితే గొడవలు అవుతున్నాయో లేదో తెలుసుకోండి. అదానీకి ఇవ్వమని చెప్పండి. విద్యుత్ ప్రైవేట్ పరం చేయమని చెప్పండి. భట్టి ఆవేశ పడటం ఎందుకు?. రాష్ట్రం దివాళా తీసిందని ప్రభుత్వ పెద్దలే చెబితే ఎవరు వస్తారు.
భట్టి విక్రమార్క: కేంద్రంపై మాట్లాడాలంటే కేటీఆర్ భయపడుతున్నారు. తీర్మానంపై మాట్లాడటానికి ఎందుకు ముందుకు రావడం లేదు. మా పార్టీని కూడా వాళ్ల పార్టీలో విలీనం చేస్తాం అంటే స్పీకర్ మరొకరికి అవకాశం ఇవ్వండి
కేటీఆర్: ఎవ్వరితో చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట దమ్మిడి పుట్టదు. కోపముంటే కేసీఆర్‌ను తిట్టుకోండి. కానీ రాష్ట్రాన్ని తిట్టకండి.
-
2024-07-24T13:32:02+05:30
కేటీఆర్ సమాధానం..
తండ్రుల పేరు చెప్పుకుని అని నన్ను అనొచ్చా?
నా హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంది
తీర్మానం సరిగా ప్రవేశ పెట్టాలని చెబుతున్నా
తీర్మానాన్ని మేము సమర్థిస్తున్నాం. స్వాగతిస్తున్నాం.
-
2024-07-24T13:30:32+05:30
మంత్రి శ్రీధర్ బాబు..
కేటీఆర్ మాటలను మేము ఉపేక్షించబోం
-
2024-07-24T13:27:14+05:30
సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ రిప్లై..
సీఎంకు ఓపిక ఉండొచ్చు
పేమెంట్ కోటాలో రాలేదని నేను కూడా అనొచ్చు
సీఎం.. రాజీవ్ గాంధీని అంటున్నారా? రాహుల్ గాంధీని అంటున్నారా?
-
2024-07-24T13:24:25+05:30
కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్..
తండ్రులు, తాతలు పేర్లు చెప్పుకొని రాలేదు
మేనేజ్‌మెంట్ కోటా అనుకున్న కానీ అబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అని తెలిసింది
మొన్న ఢిల్లీకి వెళ్లి రహస్యంగా మాట్లాడుకున్నదే మీ అభిప్రాయమా?
మీ చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది
ఇది చర్చ అని స్పష్టంగా చెప్పాము
మా నాన్న నాకు చదువు లేకపోయినా మంత్రి పదవి ఇవ్వలేదు
మేము స్వయం కృషితో పైకి వచ్చాం
-
2024-07-24T13:11:55+05:30
ఇక్కడున్న నాయకుడి స్థాయికి మేము చాలు: కేటీఆర్
మీ స్థాయి ఏంటో మాకు తెలుసు
మాకు సమాధానం చెప్పండి
కేసీఆర్ అవసరం లేదు మీకు
నిబంధనల ప్రకారం సభను నడపడం లేదు
అసలు ఇది తీర్మానమా లేక లఘు చర్చనా అర్థం కావడం లేదు
సీఎం గతంలో కనీసం మంత్రిగా కూడా పని చేయలేదు
ఆయనకు సభా నియమాలు తెలియకపోవచ్చు
-
2024-07-24T12:18:37+05:30
అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క చిట్ చాట్
10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తోంది
బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారు.
తెలంగాణ ఏర్పడిందే నియామకాల మీద. అలాంటి నియామకాలు మీరు అధికారంలో వున్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదు.
కాంగ్రెస్ అధికారం రాగానే 30 వేల ఉద్యోగాలతో పాటు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాం
అధికారం పోయాక బీఆర్ఎస్ నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం హాస్యాస్పదంగా ఉంది
పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని బీఆర్ఎస్, జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది
అసెంబ్లీ పోడియంలోకి వెళ్లినా, ప్లకార్డులు ప్రదర్శించినా గత ప్రభుత్వం సస్పెండ్ చేసేది
కానీ మా ప్రభుత్వం అలా చేయడంలేదు. గతంలో నిరసనలను అణగదొక్కిన బీఆర్ఎస్.. ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యం
బీఆర్‌ఎస్ నిరసనలతో రాష్ట్రంలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అర్థం అవుతోంది
ఉద్యోగాల భర్తీలో ఉన్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టాం.
త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం
-
2024-07-24T12:10:46+05:30
బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది: పొన్నం ప్రభాకర్
యూనియన్లు రద్దు చేసింది ఎవరు?
రూ.4 వేల కోట్ల బకాయిలు మాకు ఇచ్చి వెళ్లారు
పని భారం పెరిగినా డబుల్ పేమెంట్ ఇస్తున్నాం
నష్టాల నుంచి లాభాల బాట పట్టిస్తున్నాం
గతంలో రిటైర్డ్ ఈడీని ఎండీగా పెట్టి సంస్థను నడిపించిన చరిత్ర మీది
ఆర్టీసీ ఆస్తులను మీ నాయకులకు అప్పనంగా అప్పగించారు
గత ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్టీసీ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు
-
2024-07-24T11:34:42+05:30
మాజీ హరీష్ రావు..
మంత్రి నాకు ప్రశ్నలు వేస్తున్నారు
నేను సమాధానం చెప్పమంటే చెబుతా
శ్రీధర్ బాబు..
మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ సమాధానం చెప్పారు
మీకు ఇంకా వివరాలు కావాలంటే మరో రూపంలో రండి
ఇది క్వశ్చన్ హవర్
-
2024-07-24T11:32:55+05:30
రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ సమావేశం
రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్
మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు
-
2024-07-24T11:30:17+05:30
హరీష్ రావు..
శ్రీధర్ బాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
ఆనాడు మీకు నిరసన తెలిపే అవకాశం ఇచ్చాం
మాకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వండి
-
2024-07-24T11:27:34+05:30
అసెంబ్లీలో వాడివేడిగా ప్రశ్నోత్తరాలు
ఆర్టీసీపై సభలో రగడ
బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య పరస్పర విమర్శల దాడి
గోదావరి వరదల వల్ల జరిగిన పంట నష్టంపై చర్చించాలని బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్
-
2024-07-24T11:22:18+05:30
ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్ రావు స్పీచ్ మొదలు పెట్టారంటూ మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం
‘మా మేనిఫెస్టోను బట్టీ పట్టినందుకు ధన్యవాదాలు’ అన్న శ్రీధర్ బాబు
‘మా మేనిఫెస్టోను బట్టీ పట్టినందుకు మీకు పాస్ మార్కులు వేస్తున్నాను’ అని ఎద్దేవా
తాను సూటిగానే ప్రశ్నలు అడుగుతున్నానని బదులిచ్చిన హరీష్ రావు
-
2024-07-24T11:11:11+05:30
అసెంబ్లీలో హరీష్ రావు..
ఆర్టీసీ కార్మికులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు
యూనియన్ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు?
చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలి
రేవంత్ సీఎం అయ్యాక రూ.300 కోట్ల బకాయిలు ఇస్తున్నట్లు చెక్కులు చూపించారు. ఇప్పటివరకు ఆ చెక్కు బస్ భవన్‌కు చేరలేదు
మహాలక్ష్మి పథకం నిధులు నెల నెలా ఆర్టీసీకి ఇస్తున్నారా? ఎప్పటి లోగా ఇస్తారు?.
రెండు పీఆర్సీ లు వెంటనే చెల్లిస్తాం అన్నారు.
-
2024-07-24T11:02:14+05:30
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య రెండో రోజు సభ మొదలైంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు, కరెంటు లేకుండా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని బీఆర్ఎస్‌ను విమర్శించారు. ‘‘ప్రతీ తండా నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేస్తాం. ప్రతీ తండాకు తాగునీటితో పాటు కరెంటు, రోడ్డు వేస్తాం. 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్తారో చెప్పండి తీసుకెళ్తాం. ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదు. తండాల అభివృద్ధి జరిగినప్పుడే సంపూర్ణ అభివృద్ధి. సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి’’ అని సీఎం అన్నారు.