కనీసవేతనాల సలహామండలి సభ్యుల నియామకం
ABN , Publish Date - Dec 13 , 2024 | 04:12 AM
తెలంగాణ కనీస వేతనాల సలహా మండలిలో సభ్యులను ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కనీస వేతనాల సలహా మండలిలో సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఉద్యోగులు/కార్మికుల తరఫున ఎర్రం పిచ్చిరెడ్డి, ఎస్.నర్సింహారెడ్డి(ఐఎన్‌టీయూసీ), మహ్మద్ యూసు్‌ఫ(ఏఐటీయూసీ), ఎన్.రాజు ముదిరాజ్(తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం), కొత్తపల్లి శ్రీనివా్‌సరెడ్డి(హైదరాబాద్ హోటల్ వర్కర్ల సంఘం), యాజమాన్య వర్గాల నుంచి మీలా జయదేవ్(ఎ్‌ఫటీసీసీఏ), కశ్య్‌పరెడ్డి, మహిమా దాట్ల(ఫిక్కి), నర్రా రవికుమార్(డిక్కి), బి.చంద్రప్రకాష్ (బీడీ కంపెనీల యాజమాన్యం)తో పాటు స్వతంత్ర సభ్యులుగా ప్రొఫెసర్ సి.రవి(సెస్), ప్రొఫెసర్ వాసంతి(నల్సార్ యూనివర్సిటీ)లను ఎంపికచేస్తూ కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మండలి రెండేళ్లపాటు ఉంటుంది. ఈమేరకు గురువారం జీవో జారీ చేశారు.
సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. జీప్లస్ 1 పద్ధతిలో భవనం నిర్మించనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్ గురువారం జీవో జారీ చేశారు. నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.