Share News

IAS Transfers: ఐఏఎస్‌లకు స్థానచలనం..

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:07 AM

రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. ఇద్దరు నాన్‌ ఐఏఎ్‌సలు సహా ఎనిమిది మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

IAS Transfers: ఐఏఎస్‌లకు స్థానచలనం..

  • రవాణా, ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ సీఎ్‌సగా వికా్‌సరాజ్‌

  • వాణిజ్య పన్నుల కమిషనర్‌ టీకే శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖకు బదిలీ

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. ఇద్దరు నాన్‌ ఐఏఎ్‌సలు సహా ఎనిమిది మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రవాణా, గృహ నిర్మాణ, సాధారణ పరిపాలనా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికా్‌సరాజ్‌ పోస్టులో స్వల్ప మార్పు చేసింది. ఆయన పోస్టును రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రీ-డిజిగ్నేట్‌ చేసింది.


వికా్‌సరాజ్‌ ఇక నుంచి రవాణా, ఆర్‌ అండ్‌ బీ, గృహ నిర్మాణ, సాధారణ పరిపాలనా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్‌ టీకే శ్రీదేవిని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీకి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, రోడ్లు-భవనాల శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌.హరీశ్‌ రెవెన్యూ శాఖలోని విపత్తుల విభాగం సంయుక్త కార్యదర్శిగా బదిలీ అయ్యారు.


వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి పి.ఉదయ్‌కుమార్‌కు మార్కెటింగ్‌ శాఖ సంచాలకులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రియాంకను పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా బదిలీ చేశారు. సహకార శాఖ సంయుక్త రిజిస్ట్రార్‌, నాన్‌ ఐఏఎస్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డిని బదిలీ చేసి హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ కో-ఆపరేటివ్‌ అసోసియేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. వరంగల్‌ వాణిజ్య పన్నుల సంయుక్త కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డిని మార్క్‌ఫెడ్‌ ఎండీగా నియమించారు.

Updated Date - Aug 04 , 2024 | 05:15 AM