Share News

Job Notification: 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 04:38 AM

తెలంగాణ సర్కారు ఇటీవల ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా తొలి నోటిఫికేషన్‌ వెలువడింది.

Job Notification: 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

  • 21 నుంచి అక్టోబరు 5 వరకు దరఖాస్తులు

  • నవంబరు 10న సీబీటీ పద్ధతిలో పరీక్ష

  • 21 నుంచి అక్టోబరు 5 వరకు దరఖాస్తులు

  • నవంబరు 10న సీబీటీ పద్ధతిలో పరీక్ష

  • కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వారికి వెయిటేజ్‌

  • ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో అత్యధికంగా 1,088 పోస్టులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సర్కారు ఇటీవల ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా తొలి నోటిఫికేషన్‌ వెలువడింది. వైద్యాశాఖలో వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. అక్టోబరు 5న సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తుందని బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి వెల్లడించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే అక్టోబరు 5 నుంచి 7వ తేదీ మధ్య ఎడిట్‌ చేసుకోవచ్చన్నారు. నవంబరు 10న కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఇంగ్లిషులోనే పేపర్‌ ఉంటుందని.. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రెండు, మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.


  • కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వారికి వెయిటేజ్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజ్‌ మార్కులు కల్పించినట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఇందుకు సర్కారీ దవాఖానాల్లో పనిచేసిన అనుభవమున్నట్లు ధ్రువ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే అభ్యర్థులు తెలంగాణ పారామెడికల్‌ బోర్డులో తమ విద్యార్హత ధృవపత్రాలను రిజిష్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి. ఇక అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపునిచ్చారు. పోస్టుల్లో 95 శాతం స్థానికులకేనని.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులని వివరించారు. ఒకవేళ ఒకటి నుంచి ఏడు వరకు ఇక్కడ చదవకుంటే... తెలంగాణ స్థానికతపై ప్రభుత్వం జారీ చేసే ధృవపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.ఝజిటటఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


  • విభాగాలు, జోన్ల వారీగా పోస్టులు..

మొత్తం 1,284 పోస్టుల్లో 1,088 ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో, 183 తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో, మరో 13 హైదరాబాద్‌ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఉన్నాయి. జోన్‌-1లో 218, జోన్‌-2లో 135, మూడులో 173, నాలుగులో 191, ఐదులో 149, ఆరులో 220, ఏడో జోన్‌లో 185 పోస్టులున్నాయని మెడికల్‌ బోర్డు తెలిపింది.

Updated Date - Sep 12 , 2024 | 04:38 AM