Share News

High Court: వైద్యుల సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ వైద్యుల సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:23 AM

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సెంట్రల్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

High Court: వైద్యుల సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ వైద్యుల సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సెంట్రల్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించేందుకు సీనియర్‌ న్యాయవాదులు జి.ఎం మొహిద్దీన్‌, న్యాయపతి ప్రశాంత్‌లను రిటర్నింగ్‌ అధికారులుగా నియమించింది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.


సోమవారం నుంచి ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 21న అవకాశమిచ్చారు. సెప్టెంబరు 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

Updated Date - Sep 16 , 2024 | 04:23 AM