Share News

TG Government: ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్.. ఏ రోజు ఏ కార్యక్రమం అంటే..

ABN , Publish Date - Nov 28 , 2024 | 08:24 PM

TG Government: రాష్ట్రంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఏ రోజు ఏయే కార్యక్రమాలు నిర్వహించనున్నారో ఇప్పుడు చూద్దాం..

TG Government: ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్.. ఏ రోజు ఏ కార్యక్రమం అంటే..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్న ఈ విజయోత్సవాల్లో ఏయే రోజు ఏయే కార్యక్రమం జరగనుందనేది షెడ్యూల్‌లో వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ దాకా మంత్రులు వరుస మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. శాఖల వారీగా ఈ ఏడాది కాలంలో పనితీరు మీద లెక్కల్ని మంత్రులు వివరించనున్నారు. 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త వేడుకలను సర్కారు కీలకంగా భావిస్తోంది.


ప్రాజెక్టులు షురూ..

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నారు. వీటితో పాటు తొలి రోజు సీఎం కప్ పోటీలు మొదలుకానున్నాయి. ఈ పోటీలు డిసెంబర్ 8న ముగుస్తాయి. విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 2న 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం కూడా జరగనుంది. అలాగే 213 కొత్త అంబులెన్సులు, 33 ట్రాన్స్ జెండర్ క్లినిక్‌లను ప్రారంభించనున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లపై పైలట్ ప్రాజెక్టునూ మొదలుపెట్టనున్నారు.


ఫైఓవర్స్‌ ప్రారంభం

డిసెంబర్ 3న హైదరాబాద్‌లో రైజింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఆరంఘర్ నుంచి జూపార్క్ వరకు నిర్మించనున్న ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. దీంతో పాటు రూ.150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనులనూ మొదలుపెట్టనున్నారు. నాలుగో తేదీన తెలంగాణ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీంతో పాటు అదే రోజు వర్చువల్ సఫారీ, వృక్ష పరిచయ కేంద్రం ప్రారంభం కానుంది. డిసెంబర్ 5న ఇందిరా మహిళా శక్తి బజార్ మొదలవనుంది. మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను స్టార్ట్ చేయనున్నారు. ఘట్‌‌కేసర్‌లో బాలికల ఐటీఐ కళాశాలల్ని ప్రారంభించనున్నారు.


ఘనంగా ముగింపు

డిసెంబర్ 6వ తేదీన యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్నారు. 244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన కూడా ప్లాన్ చేశారు. ఆ మరుసటి రోజు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మొదలవనుంది. డిసెంబర్ 8వ తేదీన 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు, 130 కొత్త మీ-సేవా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు యంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల ఆఖరి రోజైన డిసెంబర్ 9న లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్ష్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్లు ఏర్పాటు చేస్తారు.


Also Read:

దూకుడు పెంచిన సర్కార్.. పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం ...

బొద్దింక బిర్యానీ.. హైదరాబాద్‌లో కలకలం

దూసుకుపోతున్న ‘మెట్రో’.. రికార్డుసాయిలో ప్రయాణికులు

For More Telangana And Telugu News

Updated Date - Nov 28 , 2024 | 08:32 PM