Share News

Sand Transportation: ఇసుకకు యాప్‌!

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:09 AM

ఇసుక తరలింపులో అక్రమాలను అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అనుసరించాలని తెలంగాణ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీజీఎండీసీ) యోచిస్తోంది.

Sand Transportation: ఇసుకకు యాప్‌!

  • తరలింపు పర్యవేక్షణకు వినియోగం

  • వాట్సాప్‌ తరహాలో తెచ్చే యోచన

  • అక్రమాల్ని అరికట్టేందుకు కొత్త విధానం

  • ఐటీ కంపెనీతో సర్కారు సమాలోచనలు

హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఇసుక తరలింపులో అక్రమాలను అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అనుసరించాలని తెలంగాణ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీజీఎండీసీ) యోచిస్తోంది. ఇసుక రీచ్‌ల నిర్వహణ, తరలింపు, పర్యవేక్షణ, ఇసుక అమ్మకాలు.. ఇలా అన్నింటినీ ఒకే వేదికగా మానిటరింగ్‌ చేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను గానీ, యాప్‌ను గానీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎండీసీ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌కుమార్‌, కార్పొరేషన్‌ ఆపరేషన్స్‌ జీఎం రాజశేఖర్‌రెడ్డి రెండు రోజుల క్రితం పుర్‌వ్యూ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థతో సమావేశమై చర్చలు జరిపారు.


ప్రస్తుతం ఇసుక తరలింపునకు లారీ యజమానులు ప్రైవేట్‌ నెట్‌ సెంటర్లలో బాట్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా అనుమతులు పొందుతుండగా.. ఈ విధానానికి చెక్‌పెట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు పుర్‌వ్యూ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించడమో, వాట్సాప్‌ తరహాలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడమో చేయాలని యోచిస్తున్నారు. దీని ద్వారానే ఇసుక తరలింపు, బుకింగ్‌ వంటివి నిర్వహించాలని భావిస్తున్నారు.

Updated Date - Aug 06 , 2024 | 04:09 AM