Share News

Handloom Society: చేనేత.. తేలిన లెక్క!

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:48 AM

తెలంగాణ చేనేత సహకార సొసైటీ (టీజీసీవో) గోదాముల్లో ఏళ్ల తరబడి మూలుగుతున్న వస్త్రం లెక్క తేలింది. హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని గోందాలో రూ.180 కోట్ల విలువైన నిల్వలున్నట్లు శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

Handloom Society: చేనేత.. తేలిన లెక్క!

  • రూ.180 కోట్ల విలువైన నిల్వలు

  • ప్రభుత్వానికి చేనేత, జౌళీ శాఖ నివేదిక

  • ఏం చేయాలనే అంశంపై చర్చ

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణ చేనేత సహకార సొసైటీ (టీజీసీవో) గోదాముల్లో ఏళ్ల తరబడి మూలుగుతున్న వస్త్రం లెక్క తేలింది. హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని గోందాలో రూ.180 కోట్ల విలువైన నిల్వలున్నట్లు శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి నేయించిన వస్త్రాన్ని కుట్టుకు ఇవ్వకుండా గోదాముల్లో ఉంచినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే కొంత వస్త్రం ఎలుకలు, పందికొక్కుల పాలైనట్లు గుర్తించారు. పూర్తి నష్టం జరగకుండా.. వినియోగంలోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను సికింద్రాబాద్‌ డివిజన్‌ మార్కెటింగ్‌ అధికారికి అప్పగించారు.


ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్‌ కు అనుగుణంగా చేనేత ప్రాథమిక సహకార సంఘాల్లో కార్మికులతో వస్త్రాన్ని నేయించారు. స్కూల్‌ యూనిఫామ్‌లు, జంపఖానాలు, బ్లాంకెట్లు, స్త్రీ-పురుషులకు ఉపయోగపడే కుర్తా పైజామాలు, పంజాబీ డ్రెస్సులు, డ్రెస్‌ మెటీరియల్‌, టాప్స్‌, బాటమ్స్‌, ఎంబ్రాయిడరీ దుస్తులు, ప్రభుత్వ హాస్పిటళ్లు, కార్యాలయాలకు క్లాత్‌ మెటీరియల్‌ తయారీ కోసం కుట్టుకు ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంది. దీనికి టెండర్లు పిలవడం, ఏజెన్సీలకు స్టిచ్చింగ్‌ ఆర్డర్‌ ఇవ్వడం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం, లోక్‌సభ ఎన్నికలు రావడంతో దృష్టిసారించలేదు. చేనేత, జౌళీశాఖ అధికారులు సైతం సమాచారం ఇవ్వలేదు.


ఇటీవల ఈ అంశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లగా తక్షణమే విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదికకు ఆదేశించారు. విచారణ జరిపిన అధికారులు.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని గోదాముల్లో నిల్వ గురించి చెప్పారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు రూ.220కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నేసిన వస్త్రాన్ని వినియోగంలోకి తేకుంటే ప్రభుత్వంపై రూ.400కోట్లు భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ నష్టంతో పోయేందుకు టెండర్లు పిలిచి, స్టిచ్చింగ్‌ ఆర్డర్లు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టెండర్లు ఎప్పుడు? ఎలా నిర్వహించాలి? అనే మార్గదర్శకాలపై మంత్రి తుమ్మల, చేనేత, జౌళీశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ సమావేశమై నిర్ణయం తీసుకుకోనున్నారు.


  • బీసీ నిరుద్యోగులకు శిక్షణ

నిరుద్యోగులైన బీసీ యువతకు నాన్‌ రెసిడెన్షియల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నట్లు టీజీ బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ కుషాయి గూడలోని ఎల్జీ హోప్‌ టెక్నికల్‌ స్కిల్‌ అకాడమీలో 90రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. టెన్త్‌, ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణులైన వాళ్లు శిక్షణకు అర్హులని, పూర్తయిన తర్వాత ఉద్యోగవకాశాలు కల్పిస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 9 నుంచి 24వరకు ఠీఠీఠీ.్టజఛఛిట్టఠఛీడఛిజీట ఛిజ్ఛూ.ఛిజజ.జౌఠి.జీుఽ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Updated Date - Aug 09 , 2024 | 03:48 AM