Supreme Court: కోర్టు ఉత్తర్వులతో సీట్లు పొందిన విద్యార్థులకు ఇబ్బంది కలిగించం
ABN , Publish Date - Oct 16 , 2024 | 04:22 AM
న్యాయస్థానం ఆదేశాలతో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఊరట కలిగింది. అలాంటి వారికి ఇబ్బందులు కలిగించబోమని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కారు
వైద్య విద్య కోర్సుల్లో‘స్థానికత’పై కొనసాగిన విచారణ
న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానం ఆదేశాలతో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఊరట కలిగింది. అలాంటి వారికి ఇబ్బందులు కలిగించబోమని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినందున వారి స్థానికత అంశాన్ని లేవనెత్తబోమని పేర్కొంది. వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో ‘స్థానికత’కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 33 విషయమై జరిగిన విచారణ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘నీట్’ రాయడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణలో చదివిన వారే ‘స్థానికులు’గా గుర్తింపు పొందుతారని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 33లోని నిబంధన 3(ఏ)లో పేర్కొంది. ఈ కారణంగా ఇతర ప్రాంతాల్లో చదివిన తెలంగాణ వాసులు ‘స్థానికులు’ కాకుండా పోతారని పేర్కొంటూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
స్థానికతను నిర్ధారణకు ప్రభుత్వం మార్గదర్శకాలేవీ ఇవ్వనందున ఆ జీవో చెల్లదంటూ సెప్టెంబరు 5న హైకోర్టు తీర్పు చెప్పింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని సూచించింది. తీర్పును సవాలు చేస్తూ సెప్టెంబరు 11న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీల్ చేసింది. దానిపై అదే నెల 20న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అందుకు అనుగుణంగా ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఆ అవకాశాన్ని తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ మరికొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాటిపై తాజాగా సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిందని, అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ఇబ్బంది పెట్టబోమని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పష్టతనిచ్చారు. దాంతో ధర్మాసనం తదు