Share News

Seasonal Diseases: జ్వరాలపై అప్రమత్తంగా ఉండండి:సీఎస్‌

ABN , Publish Date - Aug 15 , 2024 | 01:52 AM

రాష్ట్రంలో ప్రబలుతున్న జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

Seasonal Diseases: జ్వరాలపై అప్రమత్తంగా ఉండండి:సీఎస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రబలుతున్న జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ ప్రగతిపై ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డెంగీ, చికున్‌గున్యా, ఇతర సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


కలెక్టర్లతోపాటు జిల్లాలోని ఇతర ఉన్నతాధికారులు హాస్టళ్లు, పాఠశాలల్లో ఆహార పదార్థాలు, పారిశుద్ధ్యాన్ని తనిఖీ చేయాలని, అలాగే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులను సందర్శించి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మందుల ధరలు, చికిత్సల చార్జీలపై నిఘా పెట్టాలని, ఈ నెల 5వ తేది నుంచి 9వ తేది వరకు నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో మిగిలిపోయిన ప్లాంటేషన్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - Aug 15 , 2024 | 01:52 AM