Share News

Tummala: చే‘నేత’కు చేతినిండా పని..

ABN , Publish Date - May 26 , 2024 | 04:09 AM

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు దీర్ఘకాలికంగా లబ్ధి చేకూర్చే పథకాల కోసం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి టెస్కోకు రూ.255 కోట్ల విలువైన వస్త్రాల సరఫరా కోసం ఆర్డర్లు వచ్చాయన్నారు.

Tummala: చే‘నేత’కు చేతినిండా పని..

  • వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా.. టెస్కోకు రూ.255 కోట్ల ఆర్డర్లు వచ్చాయి: తుమ్మల

    హైదరాబాద్‌/నల్లగొండ, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు దీర్ఘకాలికంగా లబ్ధి చేకూర్చే పథకాల కోసం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి టెస్కోకు రూ.255 కోట్ల విలువైన వస్త్రాల సరఫరా కోసం ఆర్డర్లు వచ్చాయన్నారు. దీంతో చేనేత కార్మికులకు చేతినిండా పని ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడగానే రూ.33.23 కోట్ల నిధులను కార్మికులకు యార్న్‌ సబ్సిడీ రూపంలో టెస్కో నుంచి విడుదల చేశామని తెలిపారు.


  • అయితే కొంతమంది దళారులు పవర్‌లూమ్‌ వస్త్రాలను చేనేత వస్త్రాలుగా విక్రయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  • తీన్మార్‌ మల్లన్నను గెలిపిస్తే నిరుద్యోగులకు న్యాయం

ప్రశ్నించేతత్వం ఉన్న తీన్మార్‌ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో తీన్మార్‌ మల్లన్నకు మద్దతుగా శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated Date - May 26 , 2024 | 04:09 AM