TPCC senior vice-president Niranjan : సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలి
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:18 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో వుంటూ రాహుల్‌గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని టీపీసీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్
హైదరాబాద్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో వుంటూ రాహుల్‌గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని టీపీసీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే రాహుల్ చైనా ఆదేశాల మేరకే మౌనం వహిస్తున్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రధాని మోదీ చొరవ తీసుకొవాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చించి హిందువులపై దాడులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.