Share News

Geothermal Power: ‘జియో థర్మల్‌’ కేంద్రంగా మణుగూరు..

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:42 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు వద్ద భూగర్భ క్షేత్రంలో జియో థర్మల్‌ విద్యుత్తు కోసం వేడి నీటి ఊటల అన్వేషణ, పరిశీలన, అభివృద్ధిపై సింగరేణి కాలరీస్‌, ఓఎన్‌జీసీ, తెలంగాణ రెడ్కో మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

Geothermal Power: ‘జియో థర్మల్‌’ కేంద్రంగా మణుగూరు..

  • ఓఎన్‌జీసీ, రెడ్కోతో సింగరేణి ఒప్పందం..

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు వద్ద భూగర్భ క్షేత్రంలో జియో థర్మల్‌ విద్యుత్తు కోసం వేడి నీటి ఊటల అన్వేషణ, పరిశీలన, అభివృద్ధిపై సింగరేణి కాలరీస్‌, ఓఎన్‌జీసీ, తెలంగాణ రెడ్కో మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. మణుగూరు సమీపంలోని పగిడేరు వద్ద భూగర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటితో విద్యుత్తు ఉత్పాదన కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారంతో సింగరేణి గతంలో పైలట్‌ ప్రాజెక్టు కింద 20 కిలోవాట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది


. ఇది విజయవంతం కావడంతో ప్లాంట్‌ను విస్తరించేందుకున్న అవకాశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం సింగరేణిభవన్‌లో సంస్థ సీఎండీ ఎన్‌.బలరామ్‌, ఓఎన్‌జీసీ డైరెక్టర్‌(అన్వేషణ విభాగం) సుష్మా రావత్‌, తెలంగాణ రెడ్కో జీఎం సత్యవరప్రసాద్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బలరామ్‌ మాట్లాడుతూ.. మణుగూరులో 122 మెగావాట్ల జియో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశముందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎ్‌సఐ) నివేదిక ఇచ్చిందన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 05:42 AM