Ration Cards: అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 16 , 2024 | 02:01 PM
Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో వీటి మీద అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..
కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా స్టేట్‌లో రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారితో పాటు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వారు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కార్డులు జారీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో అమలయ్యే చాలా ప్రభుత్వ స్కీమ్‌లకు రేషన్ కార్డు లింక్ ఉంది. దీంతో వీటి కోసం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.
సన్నబియ్యం కూడా..
రేషన్ కార్డులపై ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్డుల జారీపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. త్వరలో ఈ ప్రక్రియ షురూ అవుతుందన్నారు. సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల మంజూరు మొదలవుతుందన్నారు ఉత్తమ్. ఇప్పటికే ఈ విషయంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యాన్ని కూడా అర్హులకు అందిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
అర్హులకే ఇవ్వాలి
రేషన్ కార్డుల జారీపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అవసరం ఉన్నవారికే కార్డులు ఇవ్వాలన్నారు. అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కొందరు అనర్హులు కూడా రేషన్ కార్డులు పొంది సర్కారు ఖజానాకు గండికొడుతున్నారని తెలిపారు. పేదలకు మాత్రమే ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా మరో 36 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
Also Read:
బర్త్ టు డెత్.. ఇక ఆన్‌లైన్‌లోనే అన్ని సర్టిఫికేట్లు..
శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నా.. బాధగా ఉంది
జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్..
శ్రీవారి భక్తులకు అలర్ట్..
For More Telangana And Telugu News