Share News

VC Sajjanar: ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:14 AM

‘గ్రాండ్‌ హెల్త్‌ చాలెంజ్‌’లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

VC Sajjanar:  ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ‘గ్రాండ్‌ హెల్త్‌ చాలెంజ్‌’లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలు ప్రారంభించి ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచార నివేదికలు రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆర్టీసీ కళాభవన్‌లో హెల్త్‌ వాలంటీర్‌ల సమావేశంలో సజ్జనార్‌ మాట్లాడారు.

Updated Date - Jul 24 , 2024 | 04:16 AM