Share News

Mahadharna: బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

ABN , Publish Date - Nov 25 , 2024 | 07:23 AM

తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహబూబాబాద్‌లో దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తుంది.

Mahadharna: బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

హైదరాబాద్: మహబూబాబాద్‌లో (Mahabubabad) బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా (Mahadharna) జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో కేటీఆర్ హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో మహబూబాబాద్‌కు బయలుదేరనున్నారు.


కేటీఆర్ పర్యటన ఇలా..

కొత్తగూడెం (పోచంపల్లి X రోడ్), చౌటుప్పల్, చిట్యాల, నార్కట్ పల్లి, అర్వపల్లి, మరిపెడ బంగ్లా మీదుగా మహబూబాబాద్‌కు చేరుకుంటారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరగనున్న బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటారు.

మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

కాగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టేందుకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వెయ్యి మందితో ధర్నా చేపట్టొచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ మాత్రం 50 వేల మందితో మహా ధర్నా చేపడతామని మొదట ప్రకటించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో.. తక్కువ మందితోనే ధర్నా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.


అంతకుముందు మహబూబాబాద్‌లో గిరిజన రైతుల మహాధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీ పోలీసులను కోరింది. కానీ పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. తొలుత పోలీసులు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో.. బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. మహా ధర్నాకు అనుమతి ఇచ్చే వరకు కదిలేది లేదని ప్రకటించారు. చివరకు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. వాదనలు విన్న ధర్మాసనం.. బీఆర్ఎస్ మహా ధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం మహబూబాబాద్‌లో మహాధర్న చేపట్టనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ భేటీల మర్మమేమి...

అబద్ధాల్లో తగ్గేదేలే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 25 , 2024 | 07:23 AM