TS News: బీఆర్‌ఎస్ నేత వేధింపులు తాళలేక చిట్ ఫండ్స్ మేనేజర్ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Apr 05 , 2024 | 10:40 AM
Telangana: బీఆర్‌ఎస్ నేత వేధింపులు భరించలేక ఓ చిట్ ఫండ్స్ మేనేజర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. తన చావుకు బీఆర్‌ఎస్ నేతే కారణమంటూ సదరు బాధితుడు ఆవేదనతో చెప్పిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీఆర్‌ఎస్ నేత తీరుపట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
హనుమకొండ, ఏప్రిల్ 5 : బీఆర్‌ఎస్ నేత (BRS) వేధింపులు భరించలేక ఓ చిట్ ఫండ్స్ మేనేజర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. తన చావుకు బీఆర్‌ఎస్ నేతే కారణమంటూ సదరు బాధితుడు ఆవేదనతో చెప్పిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీఆర్‌ఎస్ నేత తీరుపట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
పరకాల సోమనాథ్ చిట్స్ మేనేజర్ దుమాల బాబురావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీఆర్ఎస్ నేత నాగుర్ల వెంకటేశ్వర్లు (BRS Leader Nagurla Venkateshwarulu) వేధింపులు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాబురావు ఆడియోలో తెలియజేశారు. చిట్ ఫండ్స్ బాధితుల ఒత్తిడి, బీఆర్ఎస్ రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తన చావుకు కారణమంటూ లెటర్ రాయడంతో పాటు ఓ ఆడియోను కూడా బాబురావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బాబురావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
AP Elections: దోచేయడానికి సిద్ధమా.. ప్రజల ప్రశ్నలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి..!
కాగా.. జీరో పెట్టుబడితో సోమనాథ్ చిట్స్ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. అయితే నాగుర్ల వెంకటేశ్వర్లు దగ్గర నుంచి దాదాపు కోటి 93 వేల రూపాయలు రావాల్సి ఉందంటూ మేనేజర్ ఆరోపించారు. ఈ బాధలు భరించలేకే బాబురావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో పరకాలలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం బాబురావుకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో ఒక్కసారిగా దుమారం రేపింది. దీనిపై బీఆర్‌ఎస్ నేత నాగుర్ల వెంకటేశ్వర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి...
కష్ట సుఖాల్లో సంయమనం అదే ఉగాది సందేశం
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌లో మరో సంచలనం..మునుగోడు ఉపఎన్నికల్లోనూ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...