Share News

CM Revanth: ప్రకృతి ప్రకోపం చూపించింది

ABN , Publish Date - Sep 03 , 2024 | 02:11 PM

Telangana: ప్రకృతి ప్రకోపం చూపించిందని.. అత్యంత దురదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని సీతారాంనాయక్ తండాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కొంత ఆస్తి నష్టం జరిగిందన్నారు. కొంత ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు.

CM Revanth: ప్రకృతి ప్రకోపం చూపించింది
CM Revanth Reddy

మహబూబాబాద్, సెప్టెంబర్ 3: ప్రకృతి ప్రకోపం చూపించిందని.. అత్యంత దురదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మంగళవారం జిల్లాలోని సీతారాంనాయక్ తండాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం (TG Govt) ఎన్ని చర్యలు తీసుకున్న కొంత ఆస్తి నష్టం జరిగిందన్నారు. కొంత ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. సీతారాంనాయక్ తండా సహా మూడు తండాలను ఒకే దగ్గర నిర్మాణం చేసేలా ఒక గ్రామపంచాయితీగా రూపొందించేలా కలెక్టర్ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పరిశీలనకు పంపించాలని సూచించారు.

Khammam Floods: ఖమ్మం వరద బీభత్సానికి అసలు కారణమిదే..!


ఈ మూడు తండాల వాసులకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేసిన మంచి కాలని నిర్మాణం చేసేలా కలెక్టర్‌కుు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. ముంపుకు గురైన నష్టపోయిన వారికి 10 రోజుల పాటు నిత్యావసర వస్తులు కలెక్టర్ ద్వారా అందిస్తామని వెల్లడించారు. వర్షంతో సర్టిఫికెట్లు కానీ ఇతరత్రా గుర్తింపు కార్డులు కోల్పోయిన వారి లిస్ట్ని తయారు చేసి కావలసిన సర్టిఫికెట్లను జారీ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కొట్టుకపోయిన రోడ్లను పరిశీలించామన్నారు. మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా శాశ్వత పరిష్కారాలు చూపించేలాగా నేషనల్ హైవేతో రాష్ట్ర ఆర్‌అండ్‌బి అధికారులకు సూచన చేస్తామన్నారు.

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు



ఆకేర్ వాగు పొంగి తెగిపోయిన బ్రిడ్జి దగ్గర తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పరిష్కారంగా మరోసారి డామేజ్ లేకుండా జరగకుండా శాశ్వత పరిష్కారం చూపేలాగా పనులు చేపట్టామన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీతారాంనాయక్ తండాలో పర్యటన ముగిసిన అనంతరం సీఎం మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: ఎవ్వరినీ వదలను.. మంత్రులు, అధికారులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

Revanth Reddy: ఫామ్ హౌస్‌లో పడుకున్నోడిలా కాను.. చెప్పిందే చేస్తా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 03 , 2024 | 02:16 PM