Medaram 2024: మేడారం హుండీల లెక్కింపు మొదలు
ABN , Publish Date - Feb 29 , 2024 | 10:53 AM
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క సారక్క మహా జాతర వైభవంగా ముగిసింది. ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు సమక్క - సారలమ్మ దర్శించుకుని తమ మొక్కు తీర్చుకున్నారు. తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీలు లెక్కింపు ప్రారంభమైంది.
హనుమకొండ, ఫిబ్రవరి 29: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క - సారక్క మహా జాతర (Medaram Jatara) వైభవంగా ముగిసింది. ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు సమక్క - సారలమ్మ దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీలు లెక్కింపు ప్రారంభమైంది. ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీసుల సంక్షంలో హుండీలు తెరుచుకున్నారు. జాతరలో ఏర్పాటు చేసిన 512 హుండీలు కానుకలతో నిండిపోయాయి. దాదాపు పదిరోజుల పాటు 10 రోజుల పాటు లెక్కింపు జరుగనుంది. లెక్కింపులో దేవాదాయ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు, భక్తి మడళ్ళ సభ్యులు సేవలు అందించనున్నారు. పోలీస్ పహారా, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలు లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..