Share News

Harish Rao: మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది

ABN , Publish Date - May 05 , 2024 | 11:20 AM

హనుమకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు.

Harish Rao: మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది

హనుమకొండ: ఎన్నికల ప్రచారం (Election Campaign)లో భాగంగా బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆదివారం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్‌లో రోడ్ షో (Road Show) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పినవన్నీ అబద్దాలేనని, హామీలు అమలు చేయాలని కేసీఆర్ (KCR) కోరితే ముఖ్యమంత్రి దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ (Congress)కు ఓటేస్తే అబద్దాలను ఆమోదించినట్టవుతుందని, బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపిచ్చారు.


రైతు బంధు ఆలస్యం చేసినందుకు అందరికి క్షమాపణ చెప్పాలని, రైతు బంధు దుక్కి దున్నాడానికి, కలుపు తీయడానికి ఇవ్వాలని, సిగ్గు లేకుండా కళ్ళల్లో వడ్లు పోయినక ఇస్తారా? సిగ్గు లేకుండా.. అంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అపుడేమో ప్రమిసరి నోట్లు, ఇప్పుడేమో బాండ్ పేపర్లు, ఇక ఇప్పుడేమో దేవుండ్ల మీద ఓట్లు.. అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పేగులు తీసి మెడలో వేసుకుంటామని అంటున్నారని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది.. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో నడుస్తోందని, రైతు బంధు గోవిందా, కల్యాణ లక్ష్మీ గోవిందా, తులం బంగారం గోవిందా, కేసీఆర్ కిట్టు గోవిందా..గోవిందా....గో..విందా అంటూవ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు తప్ప ప్రజలకు చేసేది ఎం లేదని హరీష్ రావు విమర్శలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 11:25 AM