Share News

Seethakka: జనగామకు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది: మంత్రి సీతక్క

ABN , Publish Date - Jun 20 , 2024 | 08:05 PM

చేర్యాల(Cheryala) మండలం కమలాయపల్లి( Kamalayapally) గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగంతో కలిసి ఆమె ఆవిష్కరించారు.

Seethakka: జనగామకు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది: మంత్రి సీతక్క

సిద్ధిపేట: చేర్యాల(Cheryala) మండలం కమలాయపల్లి (Kamalayapally) గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగంతో కలిసి ఆమె ఆవిష్కరించారు. 200సంవత్సరాల క్రితమే అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన చరిత్ర జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేది అని మంత్రి అన్నారు. ఆడబిడ్డలకు చదువు అవసరమని పోరాడి విద్యను అందించిన ఆ మహానీయురాలు ప్రతి ఒక్క మహిళకు ఆదర్శం అన్నారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.."జనగామ ప్రాంతానికి నిజాం నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. చేర్యాల ప్రాంతాన్ని నాలుగు భాగాలుగా విభజించడం చాలా బాధాకరం. ఉద్యమాలకు ఊపిరి పోసిన చేర్యాల ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. గత పదేళ్లుగా గోదావరి నుంచి సాగునీరు అందక నా ప్రాంతం కూడా ఇబ్బంది పడింది. కమలాయపల్లి గ్రామానికి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాంతాలపై వివక్ష చూపి నీళ్లు, అభివృద్ధి విస్మరించారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేసి ఆటో డ్రైవర్లతో ఆందోళన చేయించారు. కమలాయపల్లి సమస్యలను ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకునివెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా" అని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Updated Date - Jun 20 , 2024 | 08:05 PM