Seethakka: అధికారులైతే ఇంటికి... కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్‌లోకి.. మంత్రి సీతక్క హెచ్చరిక
ABN , Publish Date - Jan 08 , 2024 | 10:44 AM
Telangana: గోదావరి నుంచి ఇసుకను తరలించే లారీలను నియంత్రించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర దృశ్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు.
ములుగు, జనవరి 8: గోదావరి నుంచి ఇసుకను తరలించే లారీలను నియంత్రించాలని అధికారులను మంత్రి సీతక్క (Minister seethakka) ఆదేశించారు. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర (Medaram Jatara) దృష్ట్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు. ఓవర్ లోడ్‌తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారం జాతర పనుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారులను అయితే ఇంటికి... కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్తారని మంత్రి సీతక్క హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...