Share News

Tension: మహబూబాబాద్‌లో ఉద్రిక్తత.. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు..

ABN , Publish Date - Nov 25 , 2024 | 08:40 AM

మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని.. కేటీఆర్‌కు మహబూబాబాద్‌కు వచ్చే అర్హత లేదని.. కేటీఆర్ గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Tension: మహబూబాబాద్‌లో ఉద్రిక్తత.. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు..

వరంగల్ జిల్లా: మహబూబాబాద్‌లో (Mahabubabad) బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా (Mahadharna) జరగనుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో మహబూబాబాద్‌లో ఉద్రిక్తత (Tension) నెలకొంది. కాగా ఈ గిరిజన ధర్నాలో పాల్గొనే అర్హత కేటీఆర్‌కు (KTR) లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని.. కేటీఆర్‌కు మహబూబాబాద్‌కు వచ్చే అర్హత లేదని.. కేటీఆర్ గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.


కాగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో కేటీఆర్ హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో మహబూబాబాద్‌కు బయలుదేరనున్నారు.

కేటీఆర్ పర్యటన ఇలా..

కొత్తగూడెం (పోచంపల్లి X రోడ్), చౌటుప్పల్, చిట్యాల, నార్కట్ పల్లి, అర్వపల్లి, మరిపెడ బంగ్లా మీదుగా మహబూబాబాద్‌కు చేరుకుంటారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరగనున్న బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటారు.

మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

కాగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టేందుకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వెయ్యి మందితో ధర్నా చేపట్టొచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ మాత్రం 50 వేల మందితో మహా ధర్నా చేపడతామని మొదట ప్రకటించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో.. తక్కువ మందితోనే ధర్నా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

ఆ భేటీల మర్మమేమి...

అబద్ధాల్లో తగ్గేదేలే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 25 , 2024 | 08:40 AM