Boat Journey: నాగార్జున సాగర్ - శ్రీశైలం..ప్రకృతి ఒడిలో వింత అనుభవం
ABN, Publish Date - Nov 11 , 2024 | 07:49 AM
నిత్యం ఉరుకుల పరుగులు బిజీగా బిజీగా సాగే జీవన గమనంలో ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సాగేందుకు తెలంగాణ టూరిజం లాంచ్‌ను ఏర్పాటు చేసింది. మరీ సాగర్ టూ శ్రీశైలం వెళ్లేటటువంటి క్రూయిజ్ లాంచ్‌లో ఏలాంటి మధురానుభూతులు, ప్రకృతి అందాలు ఉంటాయో ఏబీఎన్‌లో చూడండి.
నల్గొండ: నిత్యం ఉరుకుల పరుగుల జీవితం. దీనికితోడు ట్రాఫిక్ కష్టాలు. ఎక్కడైనా కాసేపు సేద తీరుదామంటే కుదరని పని. పుణ్యం, పురుషార్థం కోసం ఎక్కడికైనా వెళ్దామంటే రైళ్లు, విమానాలు, బస్సులు ఇలా అన్నింట్లోనూ సీట్లు ఫుల్ అయిపోతున్నాయి. అలాంటి వేళ తెలంగాణ పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంతకి ఆ వినూత్న కార్యక్రమం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్పెషల్ ఫోకస్ చూడాల్సిందే. నల్లమల అందాల మధ్య కృష్ణమ్మా ఓడిలో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నాగార్జున సాగర్ నుంచి ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. సుమారు 6 గంటల పాటు సాగే ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో విశేషాలు ఉన్నాయి.
కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు భక్తులు క్యూ కడుతుంటారు. అలా ఈసారి శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లేవారికి ప్రయాణంలో ఆహ్లాదాన్ని పంచుతోంది. తెలంగాణ పర్యాటక శాఖ. నల్లమల అడవుల గుండా కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మా ప్రవహిస్తోంది. ఆ పచ్చని అందాల నడుమ పలువురు తిరుగుతూ ముందుకు సాగే నదిపైనా పడవలో ప్రయాణిందే అవకాశాన్ని కల్పిస్తోంది. సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఈ పడవ ప్రయాణం ఎలా సాగుతుందో చూసోద్దామా.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 11 , 2024 | 07:50 AM