BJP:బీజేపీని వీడే ప్లాన్‌లో కీలక నేతలు.. ఎవరంటే..

ABN, Publish Date - Dec 10 , 2024 | 10:19 AM

ఆ జిల్లా బీజేపీ కేడర్‌లో జోష్ తగ్గుతోందా. పార్టీ ప్రోగ్రామ్‌లను పట్టించుకోవడం లేదా. ఎన్నికల ముందు వలస వచ్చే వారికి టికెట్లు కేటాయిస్తున్నారనే ఉద్దేశంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారా. ఈ ఇన్‌సైడ్ ప్రత్యేక కథనంలో చూడండి.

వరంగల్: ఆ జిల్లా బీజేపీ కేడర్‌లో జోష్ తగ్గుతోందా. పార్టీ ప్రోగ్రామ్‌లను పట్టించుకోవడం లేదా. ఎన్నికల ముందు వలస వచ్చే వారికి టికెట్లు కేటాయిస్తున్నారనే ఉద్దేశంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారా. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఇప్పుడు యూటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా. కరుడుగట్టిన కాషాయ నేతలు కూడా పార్టీ మారే ప్లాన్‌లో ఉన్నారా అన్న ప్రచారంతో కాషాయాసేన కలవరపడుతుందా. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది.


ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు బీజేపీ బలంగా ఉండేది. హన్మకొండ ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యే సీట్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా ధీటైన నాయకత్వం ఉండేది. కరుడుగట్టిన కాషాయవాదులు పార్టీలో ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వలసలను ప్రోత్సహించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికల నాటి నుంచి ఒక్కసారిగా డీలా పడింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పార్టీ నాయకులు జోష్ మీద ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం పరిస్థితి రోజురోజుకూ నీరసిస్తోంది.


పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు లేవు. రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా ఏదో మొక్కుబడిగా తంతుగా నిర్వహించి చేతులుదులుపుకుంటున్నారు తప్పితే యాక్టివ్‌గా పాల్గొనడం లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలిస్తామన్న నేతలు ఒక్క సీటులోనూ నెగ్గలేదు. గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. వరంగల్ తూర్పు నయోజకవర్గం మినహా మిగిలిన 11 చోట్లా కమలం పార్టీ అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు.


వరంగల్ ఈస్ట్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు రెండో స్థానంలో నిలిచారు. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కడం లేదంటే కాషాయ పార్టీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమీ నుంచి తేరుకుంటున్న సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. వరంగల్ ఒరిలో దిగిన ఆరూరి రమేష్, మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన సీతారాం నాయక్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్లారు. వలస నేతలతో ఒరిజినల్ బీజేపీ లీడర్లలో అసంతృప్తితో ఉంది. అప్పటినుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ నేతలు సైలెంట్ అయిపోయారు. పార్టీలో వలస నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు అంటీముంటన్నట్లుగా వ్యవహరించారు. బీజేపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో అడప దడప పాల్గొనడం మినహా సీరియస్‌గా తీసుకున్న చర్యలు ఏం లేవు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోహన్ బాబు ట్వీట్ వైరల్

పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 10 , 2024 | 11:36 AM