AP NEWS: హత్య కుట్రలో కీలక సూత్రధారి గౌతం రెడ్డి

ABN, Publish Date - Nov 15 , 2024 | 09:46 AM

విజయవాడ సత్యనారాయణపురంలో వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌ నేత పూనూరు గౌతంరెడ్డి దారుణాలు బయటపడ్డాయి. కబ్జా కేసులో స్థల యజమాని గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై జరిగిన దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విజయవాడ: విజయవాడ సత్యనారాయణపురంలో వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌ నేత పూనూరు గౌతంరెడ్డి దారుణాలు బయటపడ్డాయి. కబ్జా కేసులో స్థల యజమాని గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై జరిగిన దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య కుట్ర వెనుక కర్త, కర్మ, క్రియ అంతా గౌతంరెడ్డేనని స్పష్టమైంది. ఉమామహేశ్వరశాస్త్రిపై దాడికి గౌతంరెడ్డి సుపారీ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రస్తుతం నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, మిగిలిన వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. ఆ వివరాలను పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు గౌతమీషాలి, కె.తిరుమలేశ్వరరెడ్డి, మురళీకృష్ణ నాయుడు, ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ స్రవంతిరాయ్‌తో కలిసి వెల్లడించారు.


శాస్త్రిపై దాడికి గౌతంరెడ్డి కార్యాలయం కేంద్రంగా వ్యూహాలు రచించారు. అక్కడ ఉంటూ సెటిల్‌మెంట్లు చేసే న్యాయవాది పృథ్వీరాజ్‌, అతని స్నేహితుడు అనిల్‌ దాడిలో కీలకంగా వ్యవహరించారు. వీరి స్వగ్రామం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు. ఉమామహేశ్వరశాస్త్రి విషయాన్ని గౌతంరెడ్డి ముందుగా పృథ్వీరాజ్‌కు చెప్పాడు. తర్వాత మొత్తం విషయాన్ని తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. శాస్త్రిని ఏం చేయాలన్న దానిపై స్కెచ్‌లు రూపొందించుకున్నారు. శాస్త్రి కాలు, చేయి గానీ తీసేసి బయటకు రాకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేస్తే అతడు పోరాటానికి రోడ్డెక్కే అవకాశం ఉండదని భావించారు.


దీనికి సుపారీగా గౌతంరెడ్డి రూ.25 లక్షలు నిర్ణయించాడు. తర్వాత పృథ్వీరాజ్‌, అనిల్‌ కలిసి గౌతంరెడ్డి కార్యాలయంలో ప్లాన్‌ రూపొందించుకున్నారు.అనంతరం అనిల్‌ చిల్లకల్లుకు వెళ్లి అక్కడ కూలీ పనులు చేసుకునే గడ్డం వినోద్‌, తాలూరి గణేశ్‌, దేవళ్ల వంశీ, ఉప్పతోల్ల అశోక్‌కుమార్‌లను కలిశాడు. ప్లాన్‌లో భాగంగా వారికి ఖర్చుల నిమిత్తం రూ.80 వేలు ఇచ్చాడు. ఈ నలుగురు రెండుసార్లు శాస్త్రిపై దాడికి వెళ్లారు. గతనెల 31వ తేదీ రాత్రి ఇద్దరు దాడి చేయడానికి శాస్త్రి ఇంటి లోపలకు వెళ్లగా.. మరో ఇద్దరు యాక్టివాపై వచ్చి కాపలాగా ఉన్నారు. తర్వాత ఈనెల 6న మధ్యాహ్నం ఈ నలుగురు యువకులు శాస్త్రి ఇంటి వద్దకు వచ్చారు. ఇద్దరు యువకులు సత్యనారాయణపురం ఫుడ్‌ జంక్షన్‌ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్లారు. మరో ఇద్దరు బైక్‌పై వచ్చి శాస్త్రి ఇంటికి సమీపాన బైక్‌ను ఆపి కాపలాగా నిలబడ్డారు. తర్వాత నలుగురు కలిసి ఉమామహేశ్వరశాస్త్రిపై దాడిచేశారు. తమకు రూ.80 వేలు అనిల్‌ ఇచ్చాడని పోలీసులకు నిందితులు నలుగురు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మదనపల్లి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు ..

పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..

ఏపీపీఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 15 , 2024 | 10:32 AM