AP NEWS: ‘సార్ నేను తప్పుచేశాను .. చంద్రబాబుపై పోస్ట్ పెట్టాను.. నాకు బెయిల్ కావాలి’
ABN, Publish Date - Nov 15 , 2024 | 10:27 AM
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయన కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన గోర్లి సత్య నీరజ్ కుమార్ నాయుడు అనే వ్యక్తి ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసే ప్రమాదముందని.. తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అత్యంత అవసరంగా విచారణ చేపట్టాలని ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎదుటివాళ్లను బాధించే పోస్టులు పెడితే అరెస్ట్ చేయరా అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్‌పై సాధారణ పద్ధతిలోనే విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, టీడీపీ నేతలపై, వారి కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన గోర్లి సత్య నీరజ్ కుమార్ నాయుడు అనే వ్యక్తి ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది చైతన్య స్పందించారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళనలో పిటిషనర్ ఉన్నారని.. ఈ పిటిషన్‌పై అత్యంత అవసరంగా గుర్తించి విచారణ జరపాలని కోరారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మదనపల్లి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు ..
పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..
ఏపీపీఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 15 , 2024 | 10:29 AM