Year-end 2024: ఈ ఏడాదిలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది వీరే..
ABN , Publish Date - Dec 19 , 2024 | 01:55 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎంతో మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. పేరుతో పాటూ డబ్బూ సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరికొందరు ఒకే ఒక్క వీడియోతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది మాదిరే..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎంతో మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. పేరుతో పాటూ డబ్బూ సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరికొందరు ఒకే ఒక్క వీడియోతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది మాదిరే 2024లోనూ అనేక మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. వీరిలో సంచలంన సృష్టించిన వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియా వేదికగా ప్రతి ఏడాదీ అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటి ద్వారా అనేక మంది సెలబ్రిటీలుగా మారిపోతుంటారు. అలాగే ఎంతో మంది సెలబ్రిటీలు కూడా నెటిజన్ల దృష్టిని తమ వైపు తిప్పుకొంటుంటారు. 2024లో అనేక మంది వివిధ రకాల కంటెంట్‌లో నెట్టింట్లో సంచలనం సృష్టించారు. వారిలో మొదటి ఐదుగురు వ్యక్తుల విషయాలనికి వస్తే..
నాన్సీ త్యాగి..
ఈస్ట్ ఢిల్లీకి చెందిన నాన్సీ త్యాగి అనే ష్యాషన్ డిజైనర్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేయడంతో నెటిజన్లను ఆకర్షించింది. ఈమె సొంతంగా రూపొందించిన దుస్తులను ధరంచి ష్యాషన్ ఫో చేస్తుంటుంది. అలాగే అందమైన ప్రదేశాల్లో ఫొటోషూట్ చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. ఈమెను ప్రస్తుతం 3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
అంకుష్ బహుగుణ
అంకుష్ అనే వ్యక్తి ఫన్నీ స్కెచ్‌లు వేస్తూ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. పురుషులకు సంబంధించిన అలంకరణ, మేకప్ తదితర అంశాల గురించి కూడా అవగాహన కల్పిస్తుంటాడు. ఇతడు చెప్పే విషయాలు అందరికీ బాగా నచ్చడంతో వ్యూస్ లక్షల్లో వస్తుంటాయి. అంకుష్‌ను ప్రస్తుతం 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
రణవీర్ అల్లాబాడియా
రణవీర్ అల్లాబాడియా, బీర్ బైసెప్స్ అని పిలిచే ముంబై ఇన్‌ఫ్లుయెన్సర్ అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. విభిన్నమైన ప్రదేశాల్లో వినూత్నమైన కంటెంట్ క్రియేట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు. ఇతడు 2024 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ‘‘డిస్రవప్లర్ ఆఫ్ ది ఇయర్’’.. అవార్డు అందుకున్నాడు. రణవీర్‌కు ప్రస్తుతం 4.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
గౌరవ్ తనేజా
యూట్యూబ్, ఇన్‌స్టా ద్వారా సెలబ్రిటీగా మారిన గౌరవ్.. ఇటీవల తన కుటుంబలో తలెత్తిన సమస్యల కారణంగా మరింత వైరల్ అవుతున్నాడు. ఇతను తన భార్య రీతూ రాథీతో విడాకులు తీసుకున్న కారణంగా కొంతకాలంగా వార్తల్లో నిలిచారు. ఇతడికి ప్రస్తుతం 3.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.
డాలీ సింగ్
ఉత్తరాఖండ్ నైనిటాల్‌కు చెందిన డాలీ సింగ్ ఫ్యాషన్‌కు సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తన వైపునకు తిప్పుకొంటోంది. ఈమె వివిధ రకాల దుస్తులు ధరిస్తూ, ఫ్యాషన్‌కు సంబంధించి అనేక రకాల టిప్స్ కూడా చెబుతుంటుంది. డాలీ సింగ్ ప్రస్తుతం 1.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది.