Sankranti Special Trains: ప్రయాణికులకు అలర్ట్.. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ట్రైన్స్..
ABN , Publish Date - Jan 06 , 2025 | 07:01 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రత్యేక రైళ్లను ఈ మేరకు నేడు (జనవరి 6న) ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగ (Sankranti 2025) సందర్భంగా ప్రజల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Sankranti Special Trains) ప్రకటించింది. ఈ క్రమంలో వివిధ ప్రదేశాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను జనవరి 6, 2025న దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా అనౌన్స్ చేసింది. పండుగ సమయంలో రైళ్లలో ప్రయాణికుల విపరీతమైన రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు సౌకర్యంగా తమ గమ్యస్థానాలకు చేరుకోగలిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా ప్రకటించిన రైళ్లు ఏయే తేదీల్లో ఉంటాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి స్పెషల్ రైళ్ల వివరాలు
1. ట్రైన్ నం. 07615
ప్రయాణం: కాచిగూడ టూ శ్రీకాకుళం రోడ్
ట్రైన్ బయలుదేరు సమయం : 17:45
చేరుకునే సమయం: 09:00 (తరువాత రోజు)
ప్రయాణ తేదీలు: జనవరి 11, 15వ తేదీలు
ఇది రెండు సర్వీసులు కొనసాగుతుంది
2. ట్రైన్ నం. 07616
ప్రయాణం: శ్రీకాకుళం రోడ్ టూ కాచిగూడ
ట్రైన్ బయలుదేరు సమయం: 14:45
చేరుకునే సమయం: 07:35 (తరువాత రోజు)
ప్రయాణ తేదీలు: జనవరి 12, 16వ తేదీలు
ఇది రెండు సర్వీసులు కొనసాగుతుంది
3. ట్రైన్ నం. 07617
ప్రయాణం: చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్
ట్రైన్ బయలుదేరు సమయం: 19:20
చేరుకునే సమయం: 09:00 (తరువాత రోజు)
ప్రయాణ తేదీ: జనవరి 8, 2025
ఇది ఒక సర్వీసు మాత్రమే కొనసాగుతుంది
4. ట్రైన్ నం. 07618
ప్రయాణం: శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి
ట్రైన్ బయలుదేరు సమయం: 14:45
చేరుకునే సమయం: 06:30 (తరువాత రోజు)
ప్రయాణ తేదీ: జనవరి 9, 2025
ఇది ఒక సర్వీసు మాత్రమే కొనసాగుతుంది
ఈ ప్రాంతాల గుండా ప్రయాణం..
ట్రైన్ నెం. 07615/07616 కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లె స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని 3AC కోచ్‌లు ఉంటాయి.
మరోవైపు రైలు నెం. 07617/07618 చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లె, పొందూరు స్టేషన్లలో ఆపబడతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి.
బుకింగ్స్ మొదలు..
ఈ ప్రత్యేక రైళ్ల కోసం బుకింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో చాలా మంది ప్రయాణికులు వారికి కావాల్సిన సీట్లను బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక మంది ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల ద్వారా వారి గమ్య స్థానాలను చేరుకోవచ్చు. మీ ప్రయాణానికి సంబంధించి మరింత సమాచారం కోసం ప్రయాణికులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
Nara Lokesh: ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
Loyola College Walkers: మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే
Read Latest AP News And Telugu news