Share News

Vijayawada : చోరీ అయిన సెల్‌ఫోన్లు సేఫ్‌

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:19 AM

ఇండియా మొబైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ గోడౌన్‌ నుంచి మాయమైన యాపిల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలు అన్నీ సేఫ్‌గా ఉన్నాయి.

Vijayawada : చోరీ అయిన సెల్‌ఫోన్లు సేఫ్‌

  • నేడు బిహార్‌ కోర్టుకు ఫోన్ల దొంగలు

  • ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు

విజయవాడ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని ఇన్‌గ్రామ్‌ ఇండియా మొబైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ గోడౌన్‌ నుంచి మాయమైన యాపిల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలు అన్నీ సేఫ్‌గా ఉన్నాయి. ఈ నెల 5న అర్ధరాత్రి గోడౌన్‌ షట్టర్‌ను కత్తిరించిన యూపీకి చెందిన దొంగలు రూ.2.52 కోట్ల పరికరాలను దొంగిలించారు. ఈ చోరీతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను బిహార్‌ సరిహద్దుల వద్ద పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి వెళ్లిన రెండు ప్రత్యేక బృందాలు వారిని విచారిస్తున్నాయి. నిందితులను సోమవారం బిహార్‌ కోర్టులో హాజరుపరచనున్నా రు. అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై మంగళ, బుధవారా ల్లో వారిని విజయవాడకు తీసుకువచ్చే అవకాశం ఉంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 03:20 AM

News Hub