Share News

AP News: లోకేష్, మనోజ్ మధ్య చర్చకు రాని ఆ అంశం

ABN , Publish Date - Jan 15 , 2025 | 04:41 PM

Andhrapradesh: మంచు మోహన్‌ బాబుకు కాలేజ్‌కు వద్దకు వచ్చిన మనోజ్‌ను పోలీసులు అడ్డుకుని.. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న విషయాన్ని తెలియజేశారు. కాలేజ్‌కు సంబంధించి నాలుగు గేట్ల వద్దకు మనోజ్ చేరుకుని అక్కడి పోలీసులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. మనోజ్‌తో పాటు భార్య మౌనిక కూడా కాలేజ్‌కు వచ్చారు. ఆ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీశారు మనోజ్ ప్రైవేట్ సెక్యూరిటీ.

AP News: లోకేష్, మనోజ్ మధ్య చర్చకు రాని ఆ అంశం
Manchu manoj And Minister Nara Lokiesh

తిరుపతి, జనవరి 15: ఏపీ మంత్రి నారా లోకేష్‌తో (Minister Nara lokesh) మంచు మనోజ్ (Manchu Manoj) భేటీ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. బుధవారం నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్.. మంత్రి లోకేష్‌తో సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. అయితే వీరి ఇద్దరి భేటీలో ఆస్తి వివాదం చర్చకు రాన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో మోహన్‌బాబుకు చెందిన కళాశాల వద్ద నిన్న వందలాదిగా ఫ్లెక్సీలను మంచు మనోజ్ ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ఉదయానికల్లా వాటిని కొందరు బౌన్సర్లు తొలగించేశారు.


మీడియాకు సమాచారం ఇచ్చి మరీ మంచు మనోజ్ కళాశాలకు వచ్చారు. కానీ మనోజ్ కళాశాలకు రాకుండా ఇప్పటికే కోర్టు నుంచి మోహన్ బాబు కుటుంబం ఇంజక్షన్ తీసుకుంది. దీంతో ఈరోజు కాలేజ్‌కు వద్దకు వచ్చిన మనోజ్‌ను పోలీసులు అడ్డుకుని.. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న విషయాన్ని తెలియజేశారు. కాలేజ్‌కు సంబంధించి నాలుగు గేట్ల వద్దకు మనోజ్ చేరుకుని అక్కడి పోలీసులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. మనోజ్‌తో పాటు భార్య మౌనిక కూడా కాలేజ్‌కు వచ్చారు. ఆ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీశారు మనోజ్ ప్రైవేట్ సెక్యూరిటీ.

భారత్‌కు జుకర్‌బర్గ్ క్షమాపణ


అనంతరం మోహన్ బాబు కళాశాల దగ్గర్లోనే నారావారిపల్లి ఉండటంతో.. కళాశాల వద్ద నుంచి నారావారిపల్లెకు వచ్చి 45 నిమిషాలు లోకేష్‌తో గడిపారు మనోజ్ దంపతులు. కళాశాల వద్ద చంద్రబాబుతో మోహన్ బాబు తీసుకున్న ఫోటోలు, నారా లోకేష్‌తో విష్ణు తీసుకున్న ఫోటోలని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నారా కుటుంబంతో తన సన్నిహిత్యాన్ని తెలిపేందుకు లోకేష్‌ను మనోజ్ కలిసినట్లు తెలుస్తోంది. అయితే నారా లోకేష్‌తో గడిపినప్పటి ఎటువంటి ఆస్తుల వివాదం చర్చకు రానట్లు తెలుస్తోంది. ఆస్తులు వివాదం పూర్తిగా వ్యక్తిగతం అయిన నేపథ్యంలో ఏ వర్గం వైపు లేకుండా నారా కుటుంబం వ్యవహరిస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

Supreme court: సుప్రీంలో చంద్రబాబుకు భారీ ఊరట

కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 15 , 2025 | 04:52 PM